PAK vs NED : ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్

వరల్డ్ కప్‌లో (ODI WC 2023) పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. కెప్టెన్ బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్‌పైనే అందరి కళ్లూ ఉన్నాయి. వార్మప్ మ్యాచుల్లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వారిపైనే పాక్ ఎక్కువగా ఆధారపడి ఉందనే వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే, అలాంటి వాటిని పాక్ కోచ్ మికీ ఆర్థర్ కొట్టిపడేశాడు. తమ జట్టులో ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లేనని వ్యాఖ్యానించాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు ఆర్థర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు.
‘‘మేం కేవలం ఇద్దరు ఆటగాళ్లపైనే ఆధారపడి ఉంటామనే వ్యాఖ్యలు సరికాదు. మా జట్టులో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారు. రిజ్వాన్, బాబర్ ఇద్దరూ అద్భుతమైన ఆటగాళ్లే. అయితే, ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్ వంటి క్లాస్ ప్లేయర్లూ ఉన్నారు. అలాగే ఈ వరల్డ్ కప్‌లో సౌద్ షకీల్ అత్యంత ప్రభావం చూపే ఆటగాళ్లలో ఒకడు. వార్మప్ మ్యాచ్‌లో కివీస్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. నాణ్యమైన క్రికెటర్. పాక్ తరఫున సుదీర్ఘ కాలం ఆడగలడు.
అబ్దుల్లా షఫిఖ్, సల్మాన్ అలీ అఘా కూడా కీలక ఆటగాళ్లే. కాబట్టి, మేం టాప్ బ్యాటర్లు రిజ్వాన్, బాబర్‌పైనే ఎక్కువగా ఆధారపడలేదు. టాప్ ఆర్డర్‌లో వారిద్దరూ మంచి ఇన్నింగ్స్‌లు ఆడితే పాక్ భారీ స్కోరు చేయడం ఖాయం. అప్పుడు ప్రత్యర్థులపై భారీ ఒత్తిడి ఉంటుంది. కాబట్టి, మా జట్టులో ప్రతి ఒక్కరూ మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉన్నవారే’’ అని మికీ ఆర్థర్ వ్యాఖ్యానించాడు.