Mahabubnagar – కాలువకు గండిపడటంతో నీరు వృథాగా పోతుంది

అయిజ: నెట్టెంపాడు కాలువకు గండిపడటంతో నీరు వృథాగా వెళుతోంది. నెట్టెంపాడు ఎత్తిపోతల కార్యక్రమంలో భాగంగా అయిజ మండలంలోని పొలాలకు నాగంరెడ్డి రిజర్వాయర్ నుంచి ప్రధాన కాల్వ ద్వారా సాగునీరు అందుతోంది. మండలంలోని తూంకుంట పరిధిలోని ప్రధాన కాలువ గురువారం ఉదయం తెగిపోవడంతో కంది పొలాల్లోకి నీరు చేరింది. పొలాల్లోకి వరదనీరు ప్రవహించడంతో సారవంతమైన మట్టి కొట్టుకుపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పొలంలో నీరు చేరి పంటకు నష్టం వాటిల్లుతోందని రైతు పాండు తెలిపారు. అయిజ రైతు సంఘం అధ్యక్షుడు మేకల నాగిరెడ్డి రైతులతో కలిసి గండి పడిన ప్రదేశాన్ని సందర్శించారు. అధికారులు చర్యలు చేపట్టకపోతే రైతుల తీవ్రస్థాయిలో నష్టపోతారని ఆయన వివరించారు.