Hyderabad – ఏఐజీ ఆస్పత్రిలో చేరిక చంద్రబాబు … వైద్యుల సూచనల మేరకు.
హైదరాబాద్;పరీక్షల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. బుధవారం మధ్యంతర బెయిల్‌పై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బయలుదేరి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి వచ్చారు. ఏఐజీ వైద్య నిపుణుల బృందం అక్కడ చంద్రబాబును కలిసి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. వారి సలహా మేరకు ఆయన..గురువారం ఉదయం వైద్య పరీక్షల కోసం ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత.. వైద్యుల సూచనల మేరకు గురువారం సాయంత్రం చంద్రబాబు ఆస్పత్రిలో చేరారు.