Wow.. Is the parking fee a thousand rupees? ..పార్కింగ్ ఫీజు వెయ్యి రూపాయలా? బెంగళూరులోని ఆ మాల్‌కు వెళితే..


సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరు గడించిన బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తుల కలల నగరం. బెంగళూరులో అద్దె ఇల్లు దొరకడమే కష్టం. ఒకవేళ దొరికితే కళ్లు చెదిరే రీతిలో అద్దెలు కట్టాల్సి ఉంటుంది.
మన దేశంలోని బెంగళూరు నగరంలో బతకడం అంటే మాటలు కాదు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరు గడించిన బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తుల కలల నగరం. బెంగళూరులో అద్దె ఇల్లు దొరకడమే కష్టం. ఒకవేళ దొరికితే కళ్లు చెదిరే రీతిలో అద్దెలు కట్టాల్సి ఉంటుంది. బెంగళూరు జీవనం రోజు రోజుకూ ఎంత ఖరీదుగా మారుతోందో తెలిపే ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరులో ట్రాఫిక్ విపరీతంగా ఉంటుందనే సంగతి తెలిసిందే.
బెంగళూరులోని ట్రాఫిక్ సమస్యను కొన్ని మాల్స్ క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. పార్కింగ్ పేరుతో ఏకంగా వేలల్లో వసూలు చేస్తున్నాయి. ఒక గంటకు రూ.1000 వరకు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులోని యూబీ సిటీ మాల్‌లో దర్శనమిచ్చిన ఓ పార్కింగ్ సైన్ బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మాల్‌లో ప్రీమియం పార్కింగ్ పేరుతో గంటకు రూ.1000 వసూలు చేస్తున్నారు. ఓ వ్యక్తి దానిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “గంటకు పార్కింగ్ కోసం వెయ్యి రూపాయలు చెల్లించాలా“, “ప్రస్తుతం బెంగళూరులో పార్కింగ్ బిజినెస్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది“, “ఇది చాలా అన్యాయం“, “బెంగళూరులో దోపిడీకి అద్దూ అదుపు ఉండదు“, “బెంగళూరు జీవనం చాలా ఖరీదు“ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.