Viralvideo Shoe Polish: బూట్ పాలిష్ చేసిన వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి సామాజిక ప్రయోగం చేస్తూ కనిపించాడు. అతని దగ్గర చాలా డబ్బు ఉంది. అయితే తన వద్ద డబ్బు లేదని.. కానీ తన బూట్లను పాలిష్ చేయమని బూట్ పాలిష్ చేసేవారిని అడుగుతున్నాడు. అయితే తమ వద్దకు వచ్చిన కస్టమర్ వద్ద డబ్బు లేదని విన్న తరువాత.. పాలిష్ చేయకుండా అతని బూట్లను కనీసం చూడకుండా అతనికి తిరిగి ఇచ్చేశారు.
మనుషులు, జంతువులు, పక్షి ఏదయినా కష్టాల్లో ఉంటే తప్పకుండా సహాయం చేయాలి. అదే మానవత్వం. అయితే నేటి కాలంలో ఎదుటివారి పట్ల మానవత్వం చూపించి వారికి కష్టకాలంలో సాయం చేసేవారు బహు అరుదుగా కనిపిస్తున్నారు. ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే అక్కడ నుంచి పారిపోవడమో లేదా సహాయం అడిగిన వారిని తరిమికొట్టడమో చేసే వారిని చూస్తూనే ఉన్నాం. అయితే మానవత్వం మంచితనం ఉన్నవారు కొందరున్నారు. వీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా తమ కంట పడిన బాధితులకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారు భిన్నాభి ప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు సంతోషంగా, మరికొందరు కోపంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి సామాజిక ప్రయోగం చేస్తూ కనిపించాడు. అతని దగ్గర చాలా డబ్బు ఉంది. అయితే తన వద్ద డబ్బు లేదని.. కానీ తన బూట్లను పాలిష్ చేయమని బూట్ పాలిష్ చేసేవారిని అడుగుతున్నాడు. అయితే తమ వద్దకు వచ్చిన కస్టమర్ వద్ద డబ్బు లేదని విన్న తరువాత.. పాలిష్ చేయకుండా అతని బూట్లను కనీసం చూడకుండా అతనికి తిరిగి ఇచ్చేశారు.
అలా ఇద్దరు-ముగ్గురి వద్దకు వెళ్లిన తర్వాత అతను మరో బూట్ పాలిష్ చేస్తున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి తిరిగి సి అదే మాట చెప్పడం వీడియోలో చూడవచ్చు. అప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి డబ్బు లేకుండా కస్టమర్ షూలను పాలిష్ చేయడానికి అంగీకరించాడు. ఒక షూకి పాలిష్ చేసిన తర్వాత.. అతనికి మరొక షూ ఇస్తే అందులో చాలా డబ్బు ఉంది. అప్పుడు ఆ వ్యక్తి తాను ఒక సామాజిక ప్రయోగం చేస్తున్నానని.. అందులో మీరు గెలిచినట్లు చెప్పాడు. అంతేకాదు తన రెండో షూ లో ఉన్న మొత్తం డబ్బులను అతనికి ఇచ్చేశాడు. అంత భారీ మొత్తంలో డబ్బు అందుకున్న తర్వాత బూట్ పాలిష్ చేసిన వ్యక్తి ఆనందంతో ఏడవడం ప్రారంభించాడు.
ఈ భావోద్వేగ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్లో @TheFigen_ అనే IDతో భాగస్వామ్యం చేశారు రెండు నిమిషాల 43 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 8.7 మిలియన్లు అంటే 87 లక్షల మంది చూశారు. వేల మంది ఈ వీడియోను లైక్ చేసి రకరకాల రియాక్షన్స్ ఇచ్చారు. ‘దయ అనేది చాలా అందమైన భావం.. చివరికి ఒకరు గెలుస్తారు’ అని ఎదురుచూశా అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఈ దృశ్యం చూసిన తర్వాత తనకు ఏడుపు వచ్చింది’ అని ఒకరు చెప్పారు.