Viral Student Telugu Exams Paper : ఉపమాలంకారం గురించి రాయమంటే.. వీడు చూడండి..

ఓ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఎగ్జామ్ రాసిన ఆన్సర్ షీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రశ్నపత్రంలో అడిగిన ప్రశ్నకు సదరు విద్యార్థి ఇచ్చిన సమాధానం చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఆ ఆన్సర్ చూసి.. ‘ఆడు మగాడ్రా బుజ్జి’.. ‘వీడే అసలైన జాతిరత్నం’ అంటూ నెటిజన్స్ పంచ్‌లు పేలుస్తున్నారు.
ప్రజంట్ సోషల్ మీడియాలో చాలా రకాల ఫన్ కంటెంట్ వైరల్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మీమ్స్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పెద్ద..పెద్ద రాజకీయ నేతల నుంచి సినిమా సెలబ్రిటీల వరకు ఎవ్వరినీ వదలడం లేదు మీమ్ క్రియేటర్స్. క్రియేటివిటీతో పిచ్చెక్కిస్తున్నారు. వాటిని చూసిన నెటిజన్స్ తెగ నవ్వుకుంటారు. అయితే హద్దు మీరనంతవరకు మీమ్స్ ఓకే. పరిధి దాటి వేరే వాళ్ల పర్సనల్ విషయాల్లోకి వెళ్లడం మాత్రం కరెక్ట్ కాదు. ఇటీవల కొన్ని ఫన్నీ పోస్టులు కూడా భలే ఎంటర్టైన్ చేస్తున్నాయి. అందులో స్టూడెంట్స్ ఎగ్జామ్స్‌లో రాసే ఫన్నీ ఆన్సర్స్ కూడా ఉంటున్నాయి.
పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలకు ఆన్సర్స్ తెలియనప్పుడు కొందరు బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. సినిమా స్టోరీలు, తమ తెలిసిన విషయాలు రాసి పేపర్లు నింపేస్తూ ఉంటారు. అలా మాకు తారసపడిన ఓ పోస్ట్‌ను మీ ముందుకు తీసుకొచ్చాం. ఉపమాలంకారం గురించి రాయయంటే.. ఓ ఇస్మార్ట్ స్టూడెంట్స్ ఏం ఆన్సర్ రాశాడో తెలిస్తే మీరు బిత్తరపోతారు. ఉప్మా తయారు చేసే విధానాన్ని ఎంచక్కా రాసి పేపర్ నింపేశాడు. ఉప్మా చేయడానికి ఏం కావాలి.. ఎలా తయారు చేయాలి అంటూ అన్ని వివరాలు సవివరంగా రాసేశాడు. అతని ఆన్సర్ టీచర్ అడ్డంగా కొట్టేసినా.. నెటిజన్లు మాత్రం వీడు తోపు అని కామెంట్స్ పెడుతున్నారు. అసలైన జాతి రత్నం వీడు అనేస్తున్నారు. భవిష్యత్‌లో మంచి వంటగాడివి అవుతావురా తమ్ముడు అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఒరెయ్.. ఆ తెలుగు ఏంట్రా.. భూతులు రాశావ్ అని మరో భాషాభిమాని పేర్కొన్నాడు.