#Trending

USA : Indian Student Dead అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మృతదేహం గుర్తింపు

మూడు వారాల క్రితం అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్‌ కథ విషాదాంతమైంది. అతడి మృతదేహాన్ని స్థానిక పోలీసు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. క్లీవ్‌ల్యాండ్‌లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులుమహ్మద్ అర్ఫాత్ చనిపోయినట్టుగా గుర్తించారని తెలిపింది.

మూడు వారాల క్రితం అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్‌ కథ విషాదాంతమైంది. అతడి మృతదేహాన్ని స్థానిక పోలీసు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. క్లీవ్‌ల్యాండ్‌లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులుమహ్మద్ అర్ఫాత్ చనిపోయినట్టుగా గుర్తించారని తెలిపింది. మహ్మద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొంది. మహ్మద్ మరణానికి సంబంధించిన దర్యాప్తునకు సంబంధించి స్థానిక అధికారులతో మాట్లాడుతున్నామని పేర్కొంది. దు:ఖంలో ఉన్న కుటుంబానికి సాధ్యమైన అన్ని విధాలా అండగా ఉంటామని, మృతదేహాన్ని భారత్‌కు పంపిస్తామని వెల్లడించింది.

కాగా 25 ఏళ్ల మహ్మద్ అబ్దుల్ అర్ఫాట్ మాస్టర్ చదివేందుకు 2023లో అమెరికా వెళ్లాడు. ఓహియో రాష్ట్రంలోని క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. మూడు వారాల క్రితం అతడు అదృశ్యమయ్యాడు. స్థానిక పోలీసు అధికారులు రంగంలోకి దిగినా జాడ దొరకలేదు. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం మూడు వారాల క్రితం అధికారికంగా ప్రకటించింది. కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని పేర్కొన్న విషయం తెలిసిందే.

కాగా మహ్మద్‌తో చివరిసారిగా మార్చి 7న మాట్లాడామని, ఆ తర్వాత అతడి సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందని తండ్రి మహ్మద్ సలీమ్ చెప్పారు. కాగా మార్చి 19న సలీమ్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చిన వచ్చింది. డ్రగ్స్ విక్రయించే ముఠా మహ్మద్‌ను కిడ్నాప్ చేసిందని, 1,200 డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారంటూ సలీమ్ చెప్పారు. గుర్తుతెలియని నంబర్ నుండి కాల్ వచ్చిందని వివరించారు. అయితే కాల్ చేసిన వ్యక్తి ఏవిధంగా డబ్బులు చెల్లించాలనే విషయాన్ని చెప్పలేదని పేర్కొన్నాడు. తన కొడుకుతో మాట్లాడతానని కోరినా వారు వినలేదని సలీమ్ కన్నీటిపర్యంతమైన విషయం తెలిసిందే. కాగా ఈ ఏడాది అమెరికాలో వెలుగుచూస్తున్న భారతీయ విద్యార్థుల మరణాలు కలవరానికి గురిచేస్తున్నాయి.

USA :  Indian Student Dead  అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మృతదేహం గుర్తింపు

Hyderabad: 1000 Rupees Fine For Selfie :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *