United Nations : The world is in danger ప్రమాదపు అంచున ప్రపంచం.. ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

2023 సంవత్సరం ప్రపంచ ఉష్ణోగ్రత రికార్డులను బద్ధలు కొట్టిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 2014 నుంచి 2023 దశాబ్ధంలో ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతలను బ్రేక్ చేసిందని పేర్కొంది. హిమనీ నదాలు కరగడం, సముద్ర జలాలు వేడెక్కడం సహా సముద్ర మట్టాలు పెరగడం వంటి ఎన్నో ఆందోళన కలిగించే పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించింది. 2023 సంవత్సరం అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా, అలాగే ఈ దశాబ్దాన్ని అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన దశాబ్దంగా తేల్చింది.
2023 సంవత్సరం ప్రపంచ ఉష్ణోగ్రత రికార్డులను బద్ధలు కొట్టిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 2014 నుంచి 2023 దశాబ్ధంలో ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతలను బ్రేక్ చేసిందని పేర్కొంది. హిమనీ నదాలు కరగడం, సముద్ర జలాలు వేడెక్కడం సహా సముద్ర మట్టాలు పెరగడం వంటి ఎన్నో ఆందోళన కలిగించే పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించింది. 2023 సంవత్సరం అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా, అలాగే ఈ దశాబ్దాన్ని అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన దశాబ్దంగా తేల్చింది. ప్రపంచం ప్రమాదపు అంచున ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. శిలాజ ఇంధన వినియోగం పెరుగుదలే దీనికి కారణమని, వాతావరణ మార్పులు వేగంగా సంభవిస్తున్నాయనీ ఈ భూగ్రహం మనకు ఒక విపత్తు సందేశాన్ని పంపుతోందని చెప్పారు.