The son who peeled off his skin and sewed shoes for his mother : తన చర్మం ఒలిచి తల్లికి చెప్పులు కుట్టించిన తనయుడు

నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా నీ రుణం తీరదు.. ఇలాంటి మాటలు అప్పుడప్పుడూ వింటుంటాం. అయితే అది మాటవరసకు, అవతలివారిపైన మనకున్న నమ్మకం, ప్రేమను తెలియజేయడానికి అలాంటి పదాలు వాడుతుంటాం తప్ప నిజంగా ఎవరూ చేసి ఉండరు. కానీ ఓ వ్యక్తి మాత్రం నిజంగానే తన చర్మాన్ని ఒలిచి తల్లికి చెప్పులు కుట్టించాడు. ఇదేంటంటే.. తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదని, అందుకు శ్రీరాముడే తనకు ఆదర్శమని చెబుతున్నాడు.
నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా నీ రుణం తీరదు.. ఇలాంటి మాటలు అప్పుడప్పుడూ వింటుంటాం. అయితే అది మాటవరసకు, అవతలివారిపైన మనకున్న నమ్మకం, ప్రేమను తెలియజేయడానికి అలాంటి పదాలు వాడుతుంటాం తప్ప నిజంగా ఎవరూ చేసి ఉండరు. కానీ ఓ వ్యక్తి మాత్రం నిజంగానే తన చర్మాన్ని ఒలిచి తల్లికి చెప్పులు కుట్టించాడు. ఇదేంటంటే.. తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదని, అందుకు శ్రీరాముడే తనకు ఆదర్శమని చెబుతున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి చెందిన రౌనక్ గుర్జర్ అనే వ్యక్తి తన తల్లిపై ప్రేమను వినూత్న రీతిలో చాటుకున్నాడు. తన చర్మం వలిచి తల్లికి చెప్పులు కుట్టించాడు. ఓ మతపరమైన కార్యక్రమంలో ఆ చెప్పులను తల్లికి బహూకరించాడు. ఈ విషయంలో తనకు శ్రీరాముడే ఆదర్శం అని రౌనక్ గుర్జర్ వెల్లడించాడు. తాను నిత్యం రామాయణ పారాయణం చేస్తుంటానని, శ్రీరాముడి దివ్యగాథ తనను ఎంతగానో ప్రభావితం చేసిందని తెలిపాడు.