Thalapathy Vijay : The car got badly damaged ఓరి మీ అభిమానం చల్లగుండా.. కారు గుల్ల చూశారుగా..!

విజయ్ కు ఇతర భాషల్లోనూ భారీగా ఫాన్స్ ఉన్నారు.తెలుగులోనూ ఈ హీరోకు మంచి మార్కెట్ ఉంది. తమిళనాడులోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ అభిమానులు ఉన్నారు. తెలుగు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా దళపతి విజయ్ 14 ఏళ్ల తర్వాత మూవీ షూటింగ్ కోసం కేరళ వెళ్లారు.
నటుడు దళపతి విజయ్‌కు ఉన్న డ్యాం ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్న విజయ్ కు ఇతర భాషల్లోనూ భారీగా ఫాన్స్ ఉన్నారు.తెలుగులోనూ ఈ హీరోకు మంచి మార్కెట్ ఉంది. తమిళనాడులోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ అభిమానులు ఉన్నారు. తెలుగు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా దళపతి విజయ్ 14 ఏళ్ల తర్వాత మూవీ షూటింగ్ కోసం కేరళ వెళ్లారు. విజయ్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అభిమానులు. విజయ్ రాకముందే విమానాశ్రయం దగ్గర పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విజయ్ తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకున్నారు. విజయ్ నటిస్తున్నా నయా మూవీ ‘GOAT’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) షూటింగ్‌లో ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. విజయ్ స్టార్ హీరో కాబట్టి ఎక్కడికి వెళ్లినా గట్టి భద్రత ఉంటుంది. అలాగే ఇప్పుడు విజయ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను ఏర్పాటు చేశారు. కానీ ఫాన్స్ తాకిడికి విజయ్ కారు గుల్లయ్యింది. ఒక్కసారిగా అభిమానులు కారు మీదకు రావడంతో కారు బాగా డ్యామేజ్ అయ్యింది. కారు అద్దాలు పగిలిపోవటంతో పాటు ఎక్కడికక్కడ సొట్టపోయింది కారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘గోట్’ చిత్రంలో విజయ్‌తో పాటు ప్రభుదేవా, ప్రశాంత్, వినయ్, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. వెంకట్ ప్రభుఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ మూవీని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తుంది.