#Trending

Telangana Fire Department Celebrating Firefighters Week :  జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం..

1944 లో కార్గో ఫైర్ యాక్సిడెంట్‎లో 66 మంది చనిపోయిన ఘటన అందరినీ కలిచివేసింది. ఈ విషాదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏప్రిల్ 14 ను జాతీయ అగ్నిమాపక దినంగా జరుపుతున్నాయి ప్రభుత్వాలు. అందులో భాగంగానే వారోత్సవాలు నిర్వహిస్తున్నారు తెలంగాణ ఫైర్ సర్వీసెస్ విభాగం. ‘అగ్ని నివారణ కాపాడుదాం – దేశ సంపదను కాపాడుదాం’ అనే నినాదంతో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహణ జరుపుతోంది.

1944 లో కార్గో ఫైర్ యాక్సిడెంట్‎లో 66 మంది చనిపోయిన ఘటన అందరినీ కలిచివేసింది. ఈ విషాదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏప్రిల్ 14 ను జాతీయ అగ్నిమాపక దినంగా జరుపుతున్నాయి ప్రభుత్వాలు. అందులో భాగంగానే వారోత్సవాలు నిర్వహిస్తున్నారు తెలంగాణ ఫైర్ సర్వీసెస్ విభాగం. ‘అగ్ని నివారణ కాపాడుదాం – దేశ సంపదను కాపాడుదాం’ అనే నినాదంతో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహణ జరుపుతోంది. ఈ వారోత్సవాలు ఏప్రిల్ 14 నుండి 22 జరగనున్నాయి. ప్రమాదాలకు సంబంధించి 2022 లో 7962 కాల్స్ రాగా, 2023 లో 8024 కాల్స్ వచ్చాయని తెలంగాణ రాష్ట్ర ఫైర్ డిజి నాగిరెడ్డి అన్నారు. అగ్నిప్రమాదాల్లో 2022 లో 45 మంది చనిపోగా,2023 లో 44 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలను వెల్లడించారు. ఇక 2023 లో 1,072 కోట్ల ఆస్తిని కాపాడాము అని తెలిపారు. 2022 లో 213 మందిని, 2023 లో 90 మందిని రక్షించామని ఫైర్ డిజి అన్నారు.

2023 లో 195 మాక్ డ్రిల్స్ చేసిన ఫైర్ సిబ్బంది.. అగ్నిప్రమాదలకు కారణం నిర్లక్ష్యంగా పొగ తాగడం, విద్యుత్ షార్ట్ సరక్యూట్, వంట గ్యాస్, ఎక్కువ వేడికి గురయ్యే వస్తువుల కారణంగా ప్రమాదలు జరుగుతాయి అని తెలిపారు. హాస్పిటల్, స్కూల్స్, ఆఫీస్‎లలో అగ్నిమాపక అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు సిబ్బంది. సేఫ్టీ కోసం అనేక చర్యలు చేపడుతున్నామని అని అన్నారు. ఈ ఏడాది 480 మంది కానిస్టేబుల్ ఫైర్ ఉద్యోగంలోకి రాగా 20 మంది ఎస్సైలు కూడా రిక్రూట్ అయ్యారని తెలిపారు.

ఫైర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం రావడం వల్ల రోజు ఏదో ఒక కొత్త అంశాన్ని నేర్చుకోవడంతోపాటు వివిధ రకాల అగ్ని ప్రమాదపు ఘటనలలో పాల్గొనడం వల్ల వాటి పరిస్థితులను కంట్రోల్ చేసే అవగాహన సైతం వస్తుందని తెలిపారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే కంటే ముందే అక్కడ ఉన్న ప్రజలు అవగాహనతో మంటలు ఆర్పే ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ సమ్మర్లో కిచెన్, గోడౌన్స్ షాపులలో ఫైర్ సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఫైర్ పట్ల అందరికీ అవగాహన ఉండాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *