Telangana Congress: Kadiyam Kavya & Srihari కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య.. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. అనుకున్నట్లుగానే ఆదివారం బీఆర్ఎస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. అనుకున్నట్లుగానే ఆదివారం బీఆర్ఎస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న కడియం శ్రీహరి, కావ్య కు.. దిపాదాస్ మున్షి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కడియం శ్రీహరితో పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే, కడియం శ్రీహరికి ఫోన్ చేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కీలక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కావ్య పేరును కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో ఇవాళ చర్చల తర్వాత పెండింగ్ 4 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. అందులో వరంగల్ అభ్యర్థిగా కావ్య పేరు ఫైనల్ అవ్వొచ్చంటున్నారు. కడియం ఫ్యామిలీని కాంగ్రెస్‌లోకి తీసుకోవడంపై స్థానికంగా వరంగల్ నేతల నుంచి నిరసన వ్యక్తమైనా.. హైకమాండ్ అందరికీ సర్ది చెప్పింది. పార్టీ బలోపేతం కోసం తీసుకున్న నిర్ణయాల్ని గౌరవించాలని వారికి చెప్పారు.
సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న మరో 4 లోక్‌సభ స్థానాలపై చర్చ అనంతరం.. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ లో పోటీచేసే వారి పేర్లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 13 మంది అభ్యర్థులను ప్రకటించింది.. ఇవాల్టి సమావేశంలో నలుగురు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. కాగా.. ఖమ్మం ఎంపీ సీటు కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, భట్టి విక్రమార్క భార్య నందిని పోటీ పడుతున్న విషయం తెలిసిందే.