TAIWAN : Maternity Nurses Protect Newborn Babies During Taiwan Earthquake తమ ప్రాణాలను పణంగా పెట్టిన కాపాడిన నర్సులు..

తైవాన్లో భూకంపం సంభవించి.. భారీ నష్టాన్ని మిగిల్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. ఈ భూకంపం చాలా బలంగా ఉంది. చాలా ఆకాశహర్మ్యాలు కూలిపోయాయి. జపాన్లోని రెండు దీవులను కూడా సునామీ తాకింది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భూకంపం ఏర్పడిన సమయంలో ఆసుపత్రిలో పనిచేసే నర్సులు త్వర త్వరగా పుట్టిన పిల్లలను ఉంచిన గదికి వచ్చినట్లు ఈ వీడియోలో చూపిస్తోంది.

ఇటీవలి కాలంలో ప్రపంచంలోని అనేక దేశాల్లో భూమి కంపిస్తున్న సంఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. చిన్నపాటి భూకంపాల వల్ల పెద్దగా తేడా కనిపించకపోయినా బలమైన భూకంపం వస్తే మాత్రం నగరం మొత్తం నాశనమైపోతుంది. నిన్న (బుధవారం) తైవాన్లో భూకంపం సంభవించి.. భారీ నష్టాన్ని మిగిల్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. ఈ భూకంపం చాలా బలంగా ఉంది. చాలా ఆకాశహర్మ్యాలు కూలిపోయాయి. జపాన్లోని రెండు దీవులను కూడా సునామీ తాకింది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భూకంపం ఏర్పడిన సమయంలో ఆసుపత్రిలో పనిచేసే నర్సులు త్వర త్వరగా పుట్టిన పిల్లలను ఉంచిన గదికి వచ్చినట్లు ఈ వీడియోలో చూపిస్తోంది. ప్రాణాలతో చెలగాటమాడకుండా.. పిల్లలకు హాని కలగకుండా సెల్ ఫోన్ ని ఒకరు పట్టుకున్నారు. అయితే ఆసుపత్రి గదిలో అప్పటికే ముగ్గురు నర్సులు ఉన్నారు.. వారు పిల్లలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. భూకంపం సంభవించిన వెంటనే మరొక నర్సు వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి.. తాను కూడా ఇతర నర్సులతో కలిసి పిల్లలను రక్షించడానికి సహాయం చేయడం ప్రారంభించినట్లు వీడియోలో మీరు చూడవచ్చు. తమ ప్రాణాలను సైతం పట్టించుకోకుండా పిల్లలను కాపాడటం మొదలుపెట్టిన నర్సుల ధైర్యం అమోఘం.