సూపర్ సిక్స్ పథకాలపై తెదేపా ప్రచారం

ఎమ్మిగనూరు వ్యవసాయం పట్టణంలోని పలు వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలపై పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశారు.
ఎమ్మిగనూరు వ్యవసాయం: పట్టణంలోని పలు వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలపై పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ పథకాల గురించి వివరించారు. ఒక కుటుంబం ఏడాదికి ఎంత లబ్ధిపొందుతారో గణాంకాలతో తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా గెలిపిస్తేనే రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని తెలిపారు. నాయకులు కలిముల్లా, భాస్కర్, జయన్న తదితరులు పాల్గొన్నారు.