SUDAN : Horrible hunger crisis in Sudan ఆకలి సంక్షోభంలో 50 లక్షల మంది ప్రజలు, పోషకాహార లోపంతో 7 లక్షల మంది పిల్లలు..

శుక్రవారం UN భద్రతా మండలి ఎయిడ్ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్స్ సూడాన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం దేశ ఉత్పత్తిని గణనీయంగా ప్రభావితం చేసిందని, ప్రజల జీవనోపాధి, పని తీరు ప్రభావితమయ్యాయని, ప్రజలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారని అన్నారు. వ్యాపారం దివాలా తీసే స్టేజ్ చేరుకుందని.. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దేశంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా లక్షలాది మంది ప్రజలు దేశం విడిచి వెళ్ళవలసి వస్తుంది ఈ కారణాల వలన సూడాన్‌లో ఆకలి స్థాయి పెరుగుతోంది.
గత ఏడాది నుంచి కొనసాగుతున్న యుద్ధం కారణంగా సూడాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. యుద్ధం కారణంగా సూడాన్‌లో 5 మిలియన్ల మంది ప్రజలు భయంకరమైన ఆకలి బాధితులుగా మారవచ్చని, దేశం ఆకలి, కరువు వైపు పయనించవచ్చని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. 730,000 మంది సూడానీస్ పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని UN సహాయ చీఫ్ చెప్పారు. రానున్న నెలల్లో సూడాన్‌లో సుమారు 5 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర ఆకలిని ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.