South Korean singer Park Bo Ram’s Passed Away : దక్షిణ కొరియా సింగర్ పార్క్ బొ రామ్ హఠాన్మరణం

దక్షిణ కొరియా సింగర్ పార్క్ బొ రామ్ హఠాన్మరణం ఆమె అభిమానులను షాక్ కు గురి చేసింది. ఆమె వయసు కేవలం 30 ఏళ్లు మాత్రమే.. సింగర్ పార్క్ బొ రామ్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దక్షిణ కొరియాలో సింగర్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది పార్క్ బొ రామ్.

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు సెలబ్రెటీలు అకాల మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇటీవలే తమిళ్ నటుడు డేనియల్ బాలాజీ గుండె పోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ప్రముఖ సింగర్ కూడా అకస్మాత్తుగా కన్నుమూసింది. దక్షిణ కొరియా సింగర్ పార్క్ బొ రామ్ హఠాన్మరణం ఆమె అభిమానులను షాక్ కు గురి చేసింది. ఆమె వయసు కేవలం 30 ఏళ్లు మాత్రమే.. సింగర్ పార్క్ బొ రామ్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దక్షిణ కొరియాలో సింగర్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది పార్క్ బొ రామ్. ఆమె మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
పార్క్ బొ రామ్ మరణవార్త విని ఆమె అభిమానులు , సినీ సెలబ్రెటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పార్క్ బొ రామ్ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇది ఏప్రిల్ 11న జరిగిందని తెలుస్తోంది. పార్క్ బొ రామ్ ఓ ఈవెంట్ కు హాజరయ్యిందట.. ఆ ఈవెంట్ లో ఆమె ప్రోగ్రాం నిర్వహించింది. అదే రోజు సాయంత్రం ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం సేవించింది.
మద్యం సేవించిన తర్వాత ఆమె రెస్ట్ రూమ్ కు వెళ్ళింది. ఆతర్వాత ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో ఆమె స్నేహితులు వెళ్లి చూడగా ఆమె విగత జీవిగా కనిపించిందట. రెస్ట్ రూమ్ లోని సింక్ లో పార్క్ బొ రామ్ విగత జీవిగా పడిఉండటం చూసి ఆమె స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పార్క్ బొ రామ్ మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆమె ప్రమాదవశాత్తు చనిపోయిందా.? లేక హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పార్క్ బొ రామ్ చిన్న వయసులోనే సింగర్ గా పరిచయం అయ్యింది. తన 17వ యేట నుంచే పార్క్ బొ రామ్ పాటలు ఆలపించింది. ఎన్నో అవార్డులను కూడా అందుకుంది పార్క్ బొ రామ్. ఆమె మరణంతో అభిమానులు విషాదంలో మునిగిపోయారు.