She team, awareness conference on cyber crime – షీటీం, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

మహిళల భద్రత కోసం అనేక చట్టాలున్నాయని, ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే శాఖా పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ రామేశ్వర్ అన్నారు. మంగళవారం కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీటీం, డయల్ 100, సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు చదువులపై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. వ్యసనాలకు బానిసలైతే భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. ఫోన్ల వినియోగం పెరగటంతో సైబర్ నేరాలు అధికమయ్యాయని, వాటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ మోసాలపై 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో షీటీం ఇన్‌ఛార్జులు విజయలక్ష్మి, వెంకటయ్య, సీఐ ఆంజనేయులు, ఎస్సై రమేష్, కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ వేణు తదితరులు పాల్గొన్నారు.