Sara Ali Khan : is feeding the hunger of the poor. నిరుపేదల ఆకలి తీరుస్తున్న సారా అలీ ఖాన్..

తక్కువ సమయంలోనే తన కెరీర్‌లో చాలా పేరు సంపాదించుకుంది ఈ నటి. సినిమాల ద్వారా తన అభిమానుల హృదయాలను గెలుచుకోవడమే కాదు వ్యక్తిగతంగా ప్రజలతో కలిసిపోవడానికి కూడా ఇష్టపడుతుంది. ముస్లిం కుటుంబంలో జన్మించిన సారా అలీ ఖాన్ హిందూ దేవాలయాలను సందర్శించడానికి వెళ్తుంది. ఇలా చేస్తూ అనేక విమర్శలను కూడా ఎదుర్కొంటుంది. అయినా సారా తాను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు సారా కు సంబంధించిన మరొక వీడియో బయటపడింది. దీనిలో ఆమె పేదవారికి సహాయం చేస్తుంది.
సారా అలీ ఖాన్ తల్లి దండ్రులైన అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్‌ల నుంచి నటనను వారసత్వంగా తీసుకుని సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. నటనతోనే కాదు.. మంచి మనసున్న అమ్మాయిగా అందరి మన్ననలు పొందుతుంది బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్. అవును సారా అంటే అందరికీ ఇష్టమే. తక్కువ సమయంలోనే తన కెరీర్‌లో చాలా పేరు సంపాదించుకుంది ఈ నటి. సినిమాల ద్వారా తన అభిమానుల హృదయాలను గెలుచుకోవడమే కాదు వ్యక్తిగతంగా ప్రజలతో కలిసిపోవడానికి కూడా ఇష్టపడుతుంది. ముస్లిం కుటుంబంలో జన్మించిన సారా అలీ ఖాన్ హిందూ దేవాలయాలను సందర్శించడానికి వెళ్తుంది. ఇలా చేస్తూ అనేక విమర్శలను కూడా ఎదుర్కొంటుంది. అయినా సారా తాను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు సారా కు సంబంధించిన మరొక వీడియో బయటపడింది. దీనిలో ఆమె పేదవారికి సహాయం చేస్తుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో సారా అలీ ఖాన్ ఒక సాధారణ అమ్మాయిలా రోడ్డు పక్కన నిలబడి పేద ప్రజలకు ఆహారం పంపిణీ చేస్తున్నట్లు చూడవచ్చు. ఒకొక్కరిని పలకరిస్తూ అందరి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ, కలుస్తూ మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఈ సమయంలో, నిరుపేదలు కూడా సారాకు ఆశీస్సులు అందజేయడం కనిపిస్తుంది. వీడియో చివర్లో సారా అలీ ఖాన్ పబ్లిక్ కంట పడకుండా దాక్కొని చాలా సింపుల్ గా కారులో కూర్చుని అక్కడి నుంచి ముందుకు వెళ్ళింది.