SAMANTH UPADTES : I trembled with fear when I WIRK IN Oo Antawa SONG ..ఊ అంటావా సాంగ్ చేసినప్పుడు భయంతో వణికిపోయాను..

అలాగే ఇప్పుడు నిర్మాతగానూ మారింది. తన సొంత నిర్మాణ సంస్థతో కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తుంది. అలాగే హెల్త్ పాడ్ కాస్ట్ అంటూ వైద్య నిపుణులతో కలిసి ఆరోగ్య సూచనలు ఇస్తుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఇండియా టూడే నిర్వహించిన కాన్ క్లేవ్ 2024లో మొదటిరోజు పాల్గొంది. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం.. వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది సామ్.
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా గడిపిన సామ్.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఖుషి సినిమా తర్వాత ఆమె పూర్తిగా తన ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. మయోసైటిస్ సమస్యను అధిగమించడానికి కొన్ని నెలలపాటు ఇమ్యూనిటీ బూస్టింగ్ ట్రీట్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. తన ఆరోగ్యం, చికిత్స గురించి ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంది సామ్. కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న ఆమె..ఇప్పుడిప్పుడే తిరిగి కెరీర్ పై ఫోకస్ పెట్టింది. మూవీ ఈవెంట్స్, రియాల్టీ షోలలో పాల్గొంటూ సందడి చేస్తుంది. అలాగే ఇప్పుడు నిర్మాతగానూ మారింది. తన సొంత నిర్మాణ సంస్థతో కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తుంది. అలాగే హెల్త్ పాడ్ కాస్ట్ అంటూ వైద్య నిపుణులతో కలిసి ఆరోగ్య సూచనలు ఇస్తుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఇండియా టూడే నిర్వహించిన కాన్ క్లేవ్ 2024లో మొదటిరోజు పాల్గొంది. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం.. వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది సామ్.
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో ఆమె చేసిన ఊ అంటావా సాంగ్ ఎంతో సవాలుతో కూడుకున్న పని అని వెల్లడించింది. సమంత మాట్లాడుతూ.. “ఊ అంటావా… సాంగ్ చేయాలనే నిర్ణయం కూడా ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లోని రాజీ పాత్రలాంటిదేనని భావిస్తున్నాను. ఆ సమయంలో మన చుట్టూ ఎక్కువ మంది ఉండకపోవడం.. మనకు అనవసర అభిప్రాయాలను చెప్పకపోవడమే మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే తప్పు చేయడం.. వాటి నుంచి నా బలాన్ని తెలుసుకోవడం జరిగింది. నా ధైర్యం గురించి తెలుసుకోవడానికి చేస్తున్న అన్వేషణలో భాగంగానే ఊ అంటావా సాంగ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో అసౌకర్యంగా ఫీలయ్యాను. నేను నా పట్ల నమ్మకంగా లేను. ఎందుకంటే నేను అందంగా లేను.. నేను సరిగ్గా కనిపించను అని ఇతర అమ్మాయిల మాదిరిగానే ఆలోచిస్తుంటాను. అప్పుడు నా శరీరంతో నేను అసౌకర్యంగా ఉండిపోతాను.” అంటూ చెప్పుకొచ్చింది.
“ఊ అంటావా మొదటి షాట్ చూసి భయంతో వణిపోయాను. గ్లామర్ విషయంలో కాదు.. కానీ నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాను.. ఇప్పటికీ వాటిని అధిగమించడానికి పోరాడుతున్నాను. నాకు తెలియదు సవాళ్లను ఎలా అధిగమిస్తున్నాననో తెలియడం లేదు. సిటాడెల్ సిరీస్ ఎంతో కష్టతరమైన పరిస్థితుల్లో చిత్రీకరించడం వల్ల చాలా కష్టాలను చూశాను. కానీ ఇప్పుడు గర్వపడుతున్నాను” అని సామ్ అన్నారు. అలాగే మళ్లీ స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారా ? అని అడగ్గా.. సామ్ స్పందిస్తూ.. ఇకపై అలాంటివి చేయను అని చెప్పారు. ప్రస్తుతం సామ్ కామెంట్స్ వైరలవుతున్నాయి.