#Cinema #Trending

SALMAN KHAN REAL ACTION FOR SIKINDAR AVM : స్వయంగా సల్మానే రంగంలోకి…

బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌, తమిళ అగ్ర దర్శకుడు ఎ.ఆర్‌ మురుగదాస్‌ కలయికలో వస్తున్న చిత్రం ‘సికందర్‌’. రష్మిక కథానాయిక.

బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman khan), తమిళ అగ్ర దర్శకుడు ఎ.ఆర్‌ మురుగదాస్‌ (AR murugadoss) కలయికలో వస్తున్న చిత్రం ‘సికందర్‌’ (Sikindar). రష్మిక కథానాయిక. ఇటీవల ఈ చిత్రాన్ని ప్రకటించారు. వచ్చే నెలలో షూటింగ్‌ ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నారు. ‘‘మేలోనే షురూ కావాల్సిన ఈ ప్రాజెక్టు షూటింగ్‌ కొన్ని కారణాల వల్ల జూన్ లో మొదలుకానుంది.  ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్‌ పనులు ముగింపు దశలో ఉన్నాయి. ఇందులోని యాక్షన్‌ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. జూన్‌ 20న మొదలు కానున్న ఈ మొదటి షెడ్యూల్‌లో భాగంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లనే చిత్రీకరించనున్నారు. అయితే ఈ చిత్రంలో మరో విశేషం ఉంది. ఇందులో యాక్షన సన్నివేశాలను సల్మాన్‌ స్వయంగా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీని కోసం ఇప్పటికే ఆయన కసరత్తులు మొదలుపెట్టారని చిత్ర వర్గాలు తెలిపాయి. సాజిద్‌ నదియాడ్‌ వాలా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్‌కి విడుదల కానుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *