rocodile Swims Out Of Canal Tries To Climb Over Railing In Uttar Pradeshs : 10 అడుగుల మొసలి రైలింగ్ పైకి ఎక్కుతోంది..!

10 అడుగుల భారీ మొసలి నదీ నుంచి బటయకు వచ్చి సమీపంలోని ప్రాంతంలో సంచరించింది. ఈ సందర్భంగానే అడ్డుగా ఉన్న రైలింగ్ పైకి ఎక్కేందుకు ఆ భారీ మొసలి ప్రయత్నించింది. ఇదంతా చూస్తూ స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే సాధ్యం కాకపోవడంతో కింద పడింది. వెంటనే పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
మొసలి..ఈ పేరు వింటనే జనాలు భయపడుతుంటారు. అలాంటిది ఓ భారీ మొసలి రద్దీగా ఉన్న రోడ్డు పైకి రావడంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంతేకాదు..దాదాపు10 అడుగుల పొడవున్న ఆ మొసలి కాళ్లు, చేతులు కలిగి ఉన్న మనిషిలా ప్రవర్తించటం చూసి ప్రజలు షాక్‌కు గురయ్యారు. పక్కనే ఉన్న నదిలోంచి బయటకు వచ్చిన భారీ మొసలి సమీపంలోని రైలింగ్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించింది. ఈ షాకింగ్ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది..? అసలు సంగతి ఏంటో పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో బుధవారం చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని బులంద్ షహర్‌లోని నరోరా ఘాట్ వద్ద 10 అడుగుల భారీ మొసలి నదీ నుంచి బటయకు వచ్చి సమీపంలోని ప్రాంతంలో సంచరించింది. ఈ సందర్భంగానే అడ్డుగా ఉన్న రైలింగ్ పైకి ఎక్కేందుకు ఆ భారీ మొసలి ప్రయత్నించింది. ఇదంతా చూస్తూ స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే సాధ్యం కాకపోవడంతో కింద పడింది. వెంటనే పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.