Rave party case.. Actress Hema absent for trial : రేవ్‌పార్టీ కేసు.. విచారణకు నటి హేమ గైర్హాజరు….

బెంగళూరు రేవ్ పార్టీలో మాదక ద్రవ్యాలను వినియోగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు నటి హేమ.. పోలీస్ విచారణకు గైర్హాజరయ్యారు. తనకు జ్వరంగా ఉందని, విచారణకు హాజరయ్యేందుకు ఒక వారం సమయం కావాలని సీసీబీ అధికారులకు ఆమె లేఖ పంపించారు.
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: బెంగళూరు రేవ్ పార్టీలో మాదక ద్రవ్యాలను వినియోగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు నటి హేమ.. పోలీస్ విచారణకు గైర్హాజరయ్యారు. తనకు జ్వరంగా ఉందని, విచారణకు హాజరయ్యేందుకు ఒక వారం సమయం కావాలని సీసీబీ అధికారులకు ఆమె లేఖ పంపించారు. సోమవారం విచారణకు హాజరు కావాలని ఎనిమిది మందికి నోటీసులు జారీ చేయగా, హేమ మినహా మిగిలినవారు విచారణకు హాజరయ్యారు. ఆమెకు మరోసారి నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు.