#Trending

Pre-wedding shoot gone wrong :రిషికేశ్‌లో ప్రీ-వెడ్డింగ్ షూట్..! ఊహించని ఘటనతో సీన్‌ రివర్స్‌.. కట్‌ చేస్తే..

ఆ వీడియో రిషికేశ్‌కి చెందినదిగా తెలిసింది. వీడియో షేర్ చేస్తూ ఇలా రాశారు. రిషికేశ్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్ నిషేధం. అయినప్పటికీ ప్రొగ్రామ్‌ ఆరెంజ్‌ చేసుకున్న జంట ప్రమాదానికి గురైంది.. గంగా నది మధ్యలో చిక్కుకున్న జంటను ఎస్‌డిఆర్‌ఎఫ్ రక్షించింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా వైరల్‌గా మారాయి. పెళ్లికి ముందు జరుపుకునే ఫ్రి వెడ్డింగ్‌ షూట్‌తో జంట విపత్తుకు గురయ్యారు.

ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఇటు దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. వివాహం నిశ్చయమైన తర్వాత, ప్రతి జంట పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఫోటోగ్రాఫర్‌లందరూ జంటలకు ప్రీ-వెడ్డింగ్ షూట్‌ల కోసం ఐడియాలు ఇస్తారు. చాలా సార్లు, ప్రీ వెడ్డింగ్ షూట్ పూర్తి చేయడం చాలా భారంగా మారుతుంది. ఇక ఆ జంటల నడుమ ఉత్సాహం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక జంట పెళ్లికి ముందు ఫోటో షూట్ కోసం వెళ్లి గంగా నది మధ్యలో ఇరుక్కుపోయింది. ఆ తరువాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గంగా నది మధ్యలో ఒక జంట ఎలా ఇరుక్కుపోయిందో చూడవచ్చు.  ఈ వీడియో రిషికేశ్‌కి చెందినదిగా తెలిసింది. వీడియో షేర్ చేస్తూ ఇలా రాశారు. రిషికేశ్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్ నిషేధం. అయినప్పటికీ ప్రొగ్రామ్‌ ఆరెంజ్‌ చేసుకున్న జంట ప్రమాదానికి గురైంది.. గంగా నది మధ్యలో చిక్కుకున్న జంటను ఎస్‌డిఆర్‌ఎఫ్ రక్షించింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా వైరల్‌గా మారాయి. పెళ్లికి ముందు జరుపుకునే ఫ్రి వెడ్డింగ్‌ షూట్‌తో జంట విపత్తుకు గురయ్యారు. ఇదంతా అక్కడే నిలబడిన ఓ వ్యక్తి తన మొబైల్‌తో వీడియో చిత్రీకరించాడు. అదృష్ట వశాత్తు ఈ సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, దంపతులు సురక్షితంగా బయటపడ్డారని అధికారులు వెల్లడించారు..

ఎడిటర్జీ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి వీడియను షేర్‌ చేశారు. ఇది ఇప్పటివరకు 1.3 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు. ఈ వీడియోను కూడా దాదాపు 11 వేల మంది లైక్ చేశారు. నెటిజన్లు దీనిపై పెద్ద సంఖ్యలో కామెంట్స్ చేశారు. దీనిపై ఒక వినియోగదారు ఇలా వ్రాశారు… వారు లైఫ్ జాకెట్‌ను ఎందుకు వేసుకోలేదని ప్రశ్నించారు? మరొక వినియోగదారు రాశారు…ఇది మరణానికి ముందు జరిగిన షూట్.

video link :

https://www.instagram.com/p/C1g8YPTMVIV/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

Leave a comment

Your email address will not be published. Required fields are marked *