#Trending

old idols Jagitial News : The old idols that come out as you dig there అక్కడ తవ్వేకొద్దీ బయటపడుతున్న విగ్రహాలు

జగిత్యాల జిల్లాలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామ శివారులో దేవుళ్ల శిలా విగ్రహాలు పెద్ద సంఖ్యలో బయటపడ్డాయి. గురువారం ఉపాధి హామీ పనులు చేస్తుండగా.. ఇవి బయటపడినట్టు స్థానికులు తెలిపారు. చర్లపల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు పనుల్లో భాగంగా ఎక్కల దేవి గుట్ట వద్ద కందకాలు తవ్వుతుండగా దేవుళ్ళ శిలా విగ్రహాలు కనిపించడంతో ఆశ్చర్యపోయారు. సుమారుగా 15 విగ్రహాలు వరుసగా బయటపడినట్లు స్థానికులు తెలిపారు.

జగిత్యాల జిల్లాలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామ శివారులో దేవుళ్ల శిలా విగ్రహాలు పెద్ద సంఖ్యలో బయటపడ్డాయి. గురువారం ఉపాధి హామీ పనులు చేస్తుండగా.. ఇవి బయటపడినట్టు స్థానికులు తెలిపారు. చర్లపల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు పనుల్లో భాగంగా ఎక్కల దేవి గుట్ట వద్ద కందకాలు తవ్వుతుండగా దేవుళ్ళ శిలా విగ్రహాలు కనిపించడంతో ఆశ్చర్యపోయారు. సుమారుగా 15 విగ్రహాలు వరుసగా బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ఆ విగ్రహాలను శుభ్రం చేసిన మహిళలు పసుపు, కుంకుమ, కొబ్బరి కాయలతో పూజలు చేశారు. విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి.. విగ్రహాలను దర్శించుకుంటున్నారు. ఆ దేవుడి విగ్రహాలను చూసిన ఓ మహిళకి పూనకం వచ్చి.. ఊగిపోయింది. వారం రోజులుగా తాను అక్కడే ఉంటున్నట్లు చెప్పింది. తనకు అక్కడే గుడి కడితే అందర్నీ చల్లగా చూస్తానని.. భవిష్యవాణి చెప్పింది. పోచమ్మ, హనుమంతుడు, రాజరాజేశ్వరి దేవి, శివలింగాలు, వివిధ దేవతల విగ్రహాలు అక్కడ బయటపడ్డాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *