Minister Sitakka : Gunjedu Musalamma Jathara in Forest.. Minister Sitakka visited..కారడవిలో గుంజేడు ముసలమ్మ జాతర.. దర్శించుకున్న మంత్రి సీతక్క..

కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. ఆదివాసీల ఆరాధ్య దైవం గుంజేడు ముసలమ్మ జాతర మహా వైనవంగా జరుగుతుంది. కనీసం రోడ్డు మార్గంలేని ఆ ఆలయం వద్దకు భక్తి మార్గమే భక్తులకు నడిపిస్తుంది. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం అమ్మవారి ప్రతిరూపాన్ని వనం నుండి జనం మధ్యకు తీసుకొచ్చారు. సాధారణ భక్తులతో పాటు మంత్రి సీతక్క కూడా ముసలమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు.

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం జరిగే ఆదివాసీల ముత్యాలమ్మ జాతర మహా వైభవంగా జరుగుతుంది. మూడురోజుల పాటు జరిగే జాతరకు అడవి మార్గంలో కొండకోనలు దాటుకుంటూ వెళ్ళి ముసలమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు. మొదటి రోజు తోలెం వంశీయులు గుడిని శుద్ధిచేసి గద్దెను శుభ్రం చేశారు. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం ముసలమ్మతల్లి ప్రతిరూపాన్ని వనం నుండి జనంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు, కోలాటాలు, శివసత్తుల పూనకాలతో కారడవి మారు మ్రోగింది. అడవి మార్గంలో రాళ్ళు రప్పలు వాగులు దాటుకుంటూ వెళ్ళి ముసలమ్మ తల్లి ప్రతి రూపాన్ని ప్రతిష్టించారు.
అనంతరం గుంజేడు గ్రామంలోని గిరిజనులు, గిరిజనేతరులు ఉదయం సూర్యోదయం నుండి పిల్లా పాపలతో బోనాలు సమర్పిస్తారు. డోలు వాయిద్యాలతో గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో ఆదివాసీ నృత్యాలు చేస్తూ శివసత్తుల పూనకాలతో బోనాలు తీసుకొచ్చి వాగు ఒడ్డున వెలసిన ముత్యాలమ్మ గుడిలో సమర్పించారు. రెండవ రోజు ముసలమ్మ తల్లిని వనం నుండి తీసుకువచ్చి గుంజేడు శివారులో వాగు ఒడ్డున వున్న ఆలయ గద్దెలపై నిలిపారు. ముసలమ్మతల్లికి ప్రత్యేక పూజలు మొక్కులు తీర్చుకునేందుకు వివిధ జిల్లాల నుండి కుల మత బేధం లేకుండా భారీగా భక్తులు చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. ముసలమ్మ తల్లిని దర్శించుకొని కోళ్లు, మేకలను సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. మంత్రి సీతక్క కూడా ముసలమ్మ తల్లినీ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివాసీ ఆచార సంప్రదాయాలకు ప్రతి రూపాలుగా నిలిచే ఇలాంటి జాతరలు, పండుగలను కాపాడుకోవడం మన బాధ్యత అని గుర్తు చేశారు. నేడు భక్తుల దర్శనాలు, మొక్కుల సమర్పణ ఉంటుంది.. అనంతరం తిరిగి ముసలమ్మ తల్లి వన ప్రవేశంతో మూడు రోజుల మహా జాతర ఘట్టం పూర్తవుతుంది.