Minister KTR responded -జాహ్నవి మృతి కలచివేసింది.. అమెరికా పోలీసు ప్రవర్తన బాధాకరం

Minister KTR | కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి అమెరికాలోని సియోటెల్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే జాహ్నవి ప్రాణాలకు విలువ లేదంటూ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పోలీసు అధికారి నిర్ద్వంద వ్యాఖ్యలకు తీవ్రంగా కలత చెందినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. భారత్‌లోని అమెరికా రాయబారి యూఎస్ ప్రభుత్వ అధికారులను సంప్రదించి, జాహ్నవి కుటుంబానికి న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. అదే విధంగా ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరిపేలా డిమాండ్ చేయాలని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్‌ను కూడా అభ్యర్థిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నోఆశయాలతో ఉన్న ఆమె రోడ్డుప్రమాదంలో చనిపోవడం విషాదకరం. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఆపాదించడం మరింత దిగ్ర్భాంతికరమైన విషయం అని కేటీఆర్ అన్నారు.
https://x.com/KTRBRS/status/1702165307836797393?s=20