Man Tries To Open IndiGo Flight Door Mid Air : విమానం గాల్లో ఉండగా డోర్ తెరిచే యత్నం..

ప్రయాణంలో ఉన్న విమానం డోరు తెరిచే ప్రయత్నం చేసి కలకలం రేపిన ఓ ప్రయాణికుడి ఘటనలో పలు వివరాలు తెలిసాయి. స్నేహితులతో ఉజ్జయిని వెళ్లిన ప్రయాణికుడు అనిల్ పాటిల్ మే 21న ఇండిగో విమానంలో ఇండోర్ నుంచి హైదరాబాద్ బయలుదేరాడు. మార్గమధ్యంలో అతను కొందరు ప్రయాణికులతో గొడవ పడడంతో అతడిని ముందు సీటులో కూర్చోబెట్టారు.
ప్రయాణంలో ఉన్న విమానం డోరు తెరిచే ప్రయత్నం చేసి కలకలం రేపిన ఓ ప్రయాణికుడి ఘటనలో పలు వివరాలు తెలిసాయి. స్నేహితులతో ఉజ్జయిని వెళ్లిన ప్రయాణికుడు అనిల్ పాటిల్ మే 21న ఇండిగో విమానంలో ఇండోర్ నుంచి హైదరాబాద్ బయలుదేరాడు. మార్గమధ్యంలో అతను కొందరు ప్రయాణికులతో గొడవ పడడంతో అతడిని ముందు సీటులో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికి విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అతడు గాల్లో ప్రయాణిస్తున్న విమానం డోరు తెరిచేందుకు యత్నించడంతో ఇతర ప్రయాణికులు వారించారు. ఈ విషయమై రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఇండిగో అధికారులు కేసు నమోదు చేశారు. అయితే గత కొంతకాలంగా అతని మానసిక స్థితి సరిగ్గా లేదని అతని సోదరుడు వివిధ మెడికల్ రిపోర్టులు పోలీసులకు చూపించడంతో వాటి ఆధారంగా అతడు స్టేషన్ బెయిల్ పొందాడు. అసలు సదరు ప్రయాణికుడు అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటని స్నేహితులను ప్రశ్నించిన పోలీసులకు వారి సమాధానం విని దిమ్మతిరిగింది. అతడు మత్తుపదార్థం బంగ్ కు అలవాటు పడటమే కారణమని తెలిపారు. బంగ్ మత్తులో ఉన్నందునే సదరు ప్రయాణికుడు అలా ప్రవర్తించినట్లు తెలిపారు. మాదకద్రవ్యాలు మనిషి మానసిక స్థితిపై ప్రభావం చూపడమే కాకుండా శరీరంలోని అన్ని అవయవాలను అస్తవ్యస్తం చేస్తాయి. వాటికి బానిసలై ఒక్కసారిగా దూరమైన వారి ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటుంది.