#Trending

Lady IAS who went to Govt . Hospital..రోగిలా ముఖం కప్పుకుని సర్కార్ ఆస్పత్రికెళ్లిన లేడీ ఐఏఎస్‌.. తనిఖీల్లో నిలువెత్తు అవినీతి బట్టబయలు! వీడియో వైరల్

ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకంపై వరుస ఫిర్యాదులు అందడంతో రహస్యంగా తనిఖీ చేయాలని ఓ ఐఏఎస్‌ అధికారిణి నిర్ణయించుకున్నారు. ముఖం కప్పుకుని రోగి మాదిరిగా, ఆ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి.. ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి సిబ్బందికి షాక్‌ ఇచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లాలో జరిగింది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లోని దీదా మాయి ఆరోగ్య కేంద్రంలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, అసౌకర్యాలపై ఆ జిల్లా కలెక్టరేట్‌కు..

ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకంపై వరుస ఫిర్యాదులు అందడంతో రహస్యంగా తనిఖీ చేయాలని ఓ ఐఏఎస్‌ అధికారిణి నిర్ణయించుకున్నారు. ముఖం కప్పుకుని రోగి మాదిరిగా, ఆ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి.. ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి సిబ్బందికి షాక్‌ ఇచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లాలో జరిగింది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లోని దీదా మాయి ఆరోగ్య కేంద్రంలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, అసౌకర్యాలపై ఆ జిల్లా కలెక్టరేట్‌కు పలు ఫిర్యాదులు అందాయి. ఉదయం పది గంటలు దాటినప్పటికీ డాక్టర్లు అందులోబాటులో ఉండటం లేదని పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఆ జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ కృతి రాజ్ నిర్ణయించారు.

ఈ క్రమంలో ఐఏఎస్ అధికారి కృతి రాజ్ బుధవారం (మార్చి 13) రోగి మాదిరి ముసుగు ధరించి ఆసుపత్రికి వెళ్లి.. అక్కడ డాక్టర్‌ చెకప్‌కు వెళ్లారు. అయితే డాక్టర్‌ ప్రవర్తన సరిగా లేకపోవడాన్ని అధికారిణి కృతి గ్రహించారు. అంతేకాకుండా అక్కడ ఆసుపత్రి మెడికల్ స్టాక్‌ స్టోర్‌లో చాలా మందులు గడువు ముగిసినవి ఉన్నట్లు గుర్తించారు. హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేయగా రిజిస్టర్‌లో కొందరి సంతకాలు ఉన్నా.. ఆ సిబ్బంది అక్కడ లేకపోవడం, విధుల్లో ఉన్న సిబ్బంది సేవల తీరు సరిగా లేకపోవడాన్ని ఆమె గుర్తించి, ఆగ్రహించారు. అసుపత్రి కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.

Lady IAS who went to Govt . Hospital..రోగిలా ముఖం కప్పుకుని సర్కార్ ఆస్పత్రికెళ్లిన లేడీ ఐఏఎస్‌.. తనిఖీల్లో నిలువెత్తు అవినీతి బట్టబయలు! వీడియో వైరల్

Rain of money on the streets :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *