#Trending

Kim Jong Un: న్యూక్లియర్‌ అటాక్‌ సబ్‌మెరైన్‌ తయారీ .. ప్రపంచానికి షాకిచ్చిన ఉత్తరకొరియా!

కిమ్‌జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) నేతృత్వంలోని ఉత్తరకొరియా (North Korea) అణు కార్యక్రమాలను ఏమాత్రం ఆపడంలేదు. ఏకంగా ‘టాక్టికల్‌ న్యూక్లియర్‌ అటాక్‌ సబ్‌మెరైన్‌’ను తయారు చేసినట్లు నేడు ప్రకటించింది. రెండు రోజుల క్రితం ప్యాంగ్యాంగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కిమ్‌ స్వయంగా పాల్గొన్నారు. ఓ షిప్‌ యార్డ్‌లో సబ్‌మెరైన్‌ను పరిశీలిస్తున్న ఫొటోను విడుదల చేశారు. దీని నుంచి అణ్వాయుధాలు కూడా ప్రయోగించవచ్చని ఉ.కొరియా న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది.

ఇది సోవియట్‌ కాలం నాటి రోమియో శ్రేణి సబ్‌మెరైన్‌ డిజైన్‌ ఆధారంగా చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త సబ్‌మెరైన్‌కు ‘హీరో కిమ్‌ గన్‌-ఓకే’ అని పెట్టారు. దీని హల్‌ నంబర్‌ 841. ఈ సబ్‌మెరైన్‌ నుంచి  రెండు వరుసల్లో 10 న్యూక్లియర్‌ బాలిస్టిక్‌ మిసైల్స్‌ను ప్రయోగించవచ్చు. రష్యా సబ్‌మెరైన్‌లో ఉత్తరకొరియా భారీగానే మార్పులు చేసిందని నౌకాదళ నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం అణుదాడి చేసేది మాత్రమే కావచ్చని.. ఇది అణుశక్తితో నడిచేది కాకపోవచ్చని అమెరికా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *