#Trending

Kangana Ranaut Beaf controversy : ‘బీఫ్ తినను, కంగనా క్లారిటీ!

హిమాచల్‌ప్రదేశ్‌ లోని మండి నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరి లోకి దిగిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను రోజుకో కాంగ్రెస్‌ నేత టార్గెట్‌ చేస్తున్నారు. కంగనా రనౌత్‌ బీఫ్‌ తింటారని , అయినప్పటికి ఆమెకు బీజేపీ టిక్కెట్‌ ఇచ్చిందని మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేత విజయ్‌ వడేటివార్‌ చేసిన వ్యాఖ్యలపై రగడ రాజుకుంది.

తాను బీఫ్‌తో పాటు ఎలాంటి మాంసాహారం తిననని, తన గురించి కాంగ్రెస్‌ నేతలు ఇలాంటి పుకార్లు వ్యాపింప చేయడం సిగ్గుచేటని ట్వీట్‌ చేశారు. తాను యోగాతో పాటు ఆయుర్వేదాన్ని నమ్ముకుంటానని అన్నారు. తాను సనాతన హిందుత్వాన్ని నమ్ముతానని , ఈవిషయం ప్రజలకు తెలుసన్నారు. వారిని ఎవరూ తప్పుదారి పట్టించలేరంటూ ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ ఎక్స్ వేదిక పేర్కొన్నారు. కంగనాను కాంగ్రెస్‌ నేతలు టార్గెట్‌ చేయడం ఇది తొలిసారి కాదు… కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్‌ నేత సుప్రియా శ్రీనథే కంగనాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెకు ఈసీ నోటీసులు కూడా జారీ చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *