#Cinema #Trending

Kalki 2898 AD Movie Trailer Will Release On June 7th : కల్కి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆరోజే విడుదల..

రూ. 600 కోట్ల బడ్జెట్‏తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్, గ్లింప్స్, పోస్టర్స్ తో అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇటీవల భైరవ స్నేహితుడైన బుజ్జి రోబోటిక్ కారును పరిచయం చేశారు మేకర్స్. ఇప్పుడు కల్కి ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సందడి చేస్తుంది బుజ్జి కారు.

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో కల్కి 2898 ఏడీ ఒకటి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ తారలు దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. లోకనాయకుడు కమల్ హాసన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. రూ. 600 కోట్ల బడ్జెట్‏తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్, గ్లింప్స్, పోస్టర్స్ తో అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇటీవల భైరవ స్నేహితుడైన బుజ్జి రోబోటిక్ కారును పరిచయం చేశారు మేకర్స్. ఇప్పుడు కల్కి ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సందడి చేస్తుంది బుజ్జి కారు.

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అటు ఓటీటీలో బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ అందుబాటులోకి తీసుకవచ్చారు. కల్కి సినిమాకు రెండేళ్ల ముందు భైరవ, బుజ్జి ఎలా కలుసుకున్నారు. వీరిద్దరి మధ్య అనుబంధం ఎలా బలపడింది అనేది ఈ సిరీస్ లో చూపించనున్నారు. ప్రస్తుతం బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసే పనిలో పడ్డారు మేకర్స్.

తాజా సమాచారం ప్రకారం కల్కి 2898 ఏడీ ట్రైలర్ ను జూన్ 7న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. భారతీయ ఇతిహాసాలను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ నుంచి విజువల్ ఎఫెక్ట్స్, ఓవర్ ది టాప్ యాక్షన్ సన్నివేశాలు సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అని తెలియజేస్తున్నాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *