#Trending

Hyderabad: Delivery boy in Oyo room: డిన్నర్ చేద్దామంటూ పిలిచి.. యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డ డెలివరీ బాయ్

డిన్నర్ చేద్దామంటూ.. ఓయో రూమ్కు తీసుకువెళ్లిన యువకుడు ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ మహానగరం పరిధిలో చోటు చేసుకుంది. మల్లేపల్లి నివాసి ఉబెదుల్లా ఖాన్(22) జొమాటోలో డెలి వరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న యువతి(22)తో ఎనిమిది నెలల కిందట ఉబెదుల్లాకు ఓ మీటింగ్‌లో పరిచయమైంది.

అప్పటి నుంచి ఆ యువతితో స్నేహం కొనసాగించిన ఉబె దుల్లా.. గురువారం సాయంత్రం ఆమెకు ఫోన్ చేశాడు. ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామంటూ అతడు చెప్పడంతో యువతి అంగీకరించింది. ఇద్దరూ కలిసి బైక్‌పై కొద్దిసేపు షికార్లు కొట్టారు. రాత్రి 10 గంటల సమయంలో బిర్యానీతో పాటు బీర్ బాటిళ్లు కొనుగోలు చేసిన ఉబెదుల్లా ఖాన్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓయో రూమ్‌కు ఆమెను తీసుకువెళ్లాడు. బలవంతంగా మద్యం తాగించాడు. మద్యం మత్తులో అపస్మారక స్థితిలోకి జారుకున్న ఆ యువతిపై లైంగికదాడికి పాల్పడటంతో పాటు సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించాడు.

శుక్రవారం తెల్లవారుజామున మెలకువ వచ్చిన యువతి.. తన ఒంటిపై బట్టలు లేకపోవడంతో పాటు పక్కనే ఉబెదుల్లా కనిపించాడు. అతడి ఫోన్‌లో రికార్డింగ్ చేసిన విషయాన్ని గుర్తించిన యువతి సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేసింది. జరిగిందంతా గుర్తించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. డిన్నర్ పేరుతో పిలిచి.. బీరు తాగించి అఘాయిత్యానికి పాల్పడిన ఉబెదుల్లాఖాన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు ఉబెదుల్లాఖాన్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *