#Trending

Hollywood actress who bought Isha Ambani’s house ఇషా అంబానీ ఇంటిని కొన్న హాలీవుడ్ న‌టి..

భార‌త అప‌ర‌కుబేరుడు ముఖేశ్‌ అంబానీ, ఆయ‌న‌ భార్య నీతా అంబానీ ఇండియాలోనే అత్యంత ఖరీదైన ఇల్లు ‘యాంటిలియా’లో నివసిస్తారు. ఎన్నో ప్రత్యేక‌త‌ల‌తో కూడిన ఈ భ‌వ‌నం ఖ‌రీదు రూ. 15,000 కోట్లకు పైనే ఉంటుంది. అయితే, ఈ దంప‌తుల‌ మాదిరిగానే వారి పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రూపాయలు విలువ చేసే విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్నారు.

ఇటీవల ముఖేశ్‌ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, ఆమె భర్త ఆనంద్ పిరమల్ లాస్ ఏంజిల్స్‌లోని తమ విలాసవంతమైన భవనాలలో ఒకదానిని హాలీవుడ్ న‌టి జెన్నిఫర్ లోపెజ్, ఆమె భ‌ర్త బెన్ అఫ్లెక్‌లకు విక్రయించారు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం ఇషా అంబానీ ఈ జంటకు రూ. 494 కోట్ల భారీ మొత్తానికి ఇంటిని అమ్మిన‌ట్లు తెలుస్తోంది. కాగా, ఇషా గర్భవ‌తిగా ఉన్న సమయంలో లాస్ ఏంజెల్స్‌లోని ఈ ఇంట్లో ఎక్కువ‌ సమయం గడిపినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.

ఈ ఇల్లు ఐదేళ్ల పాటు మార్కెట్‌లో అమ్మకానికి ఉంది. కాగా ఇటీవల జెన్నిఫర్ లోపెజ్ దంప‌తులు దీన్ని కొనుగోలు చేశారు. సువిశాల‌మైన‌ ఈ భవనం బెవర్లీ హిల్స్ ప్రాంతంలో 5.2 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది.

ఇందులో 155 అడుగుల ఇన్ఫినిటీ పూల్, ఇండోర్ పికిల్‌బాల్ కోర్ట్, సెలూన్, జిమ్, స్పాలు త‌దిత‌ర‌ విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఈ భవనంలో 12 బెడ్‌రూమ్‌లు, 24 బాత్‌రూమ్‌లు, అవుట్‌డోర్ ఎంటర్‌టైన్‌మెంట్ పెవిలియన్, కిచెన్, లష్ లాన్‌లు ఉంటాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *