Good news for non-veg lovers.. Huge reduction in chicken prices..నాన్‌వెజ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కిలో ఎంతుందంటే.?

కొండెక్కిన కోడి ధరలు దిగివస్తున్నాయి. దీంతో మాంసాహార ప్రియులు బుషీ అవుతున్నారు. నిన్న ఆదివారం ఆంద్రప్రదేశ్‌లో చికెన్ స్కిన్‌లెస్ కిలో రూ.200 నుంచి 220 ధర పలికింది. వారం రోజుల క్రితం వరకు మార్కెట్ లో కిలో చికెన్ రూ.280 నుంచి రూ.310 ధర పలకగా క్రమేపీ ధరలు తగ్గుతూ వచ్చాయి.
కొండెక్కిన కోడి ధరలు దిగివస్తున్నాయి. దీంతో మాంసాహార ప్రియులు బుషీ అవుతున్నారు. నిన్న ఆదివారం ఆంద్రప్రదేశ్‌లో చికెన్ స్కిన్‌లెస్ కిలో రూ.200 నుంచి 220 ధర పలికింది. వారం రోజుల క్రితం వరకు మార్కెట్ లో కిలో చికెన్ రూ.280 నుంచి రూ.310 ధర పలకగా క్రమేపీ ధరలు తగ్గుతూ వచ్చాయి. సుమారు రూ.80 నుంచి రూ.100 ధర తగ్గడంపై నాన్వెజ్ ప్రియుల ఆనందానికి అవధుల్లేవు. రాష్ట్రంలో కోళ్ళ లభ్యత పెరగడమే ధరలు తగ్గుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ఎండలు ముదిరితే కోళ్ళు మృత్యువాత పడతాయని అప్పుడు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
నెల్లూరు నవల్లాలో బర్ట్ పూర్తి ప్రభావం కారణంగా కోళ్ళు మృత్యువాత పడటంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. కోళ్ళతో పాటే గుడ్డు ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గతనెల్లో రూ.7 పలికిన గుడ్డు ధర ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.6 నుంచి రూ.6.50 ధర పలుకుతోంది. హోల్సేల్ మార్కెట్లో రూ.5 నుంచి రూ.5.50 ధర పలుకుతోంది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ గత నెల్లో చికెన్ ధరలు భగ్గుమన్నాయి. కేజీ రూ.300 ధర దాటేయడంతో మాంసాహార ప్రియులపై అదనపు భారం పడింది. బర్డ్ ఫ్లూ కారణంగా పెద్ద సంఖ్యలో కోళ్ళు మృత్యువాత పడటం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి కోళ్ళ సరఫరాను నిలిపివేయడం తదితర కారణాలతో చికెన్ ధరలు పెరిగాయి. కోళ్ళ ఉత్పత్తి తగ్గడం ధరల పెరుగుదలకు కారణం అయిందన్న వాదనలు వినిపించాయి.
చికెన్ కేజీ రూ.300 దాటేయడంతో కొనుగోళ్ళపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. కార్తీక మాసంలో మాంసం ధరలు భారీగా పడిపోయాయి. అప్పట్లో కేజీ చికెన్ రూ.130 నుంచి రూ.140కు విక్రయించారు. దీంతో పౌల్టీ నిర్వాహకులు భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. కోళ్ళ పెంపకాన్ని తగ్గించారు. ఇటీవల బర్డ్ ఫ్లూ సోకి కోళ్ళు మృత్యువాత పడ్డాయి, దీంతో ధరలకు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇప్పట్లో దరలు తగ్గే అవకాశం లేదనుకుని ఉన్న తరుణంలో అనూహ్యంగా ధరలు తగ్గడంపై నాన్వెజ్ ప్రియులు ఖుషీ అవుతున్నారు. ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్ధులు ముమ్మరంగా ప్రచా రాలు నిర్వహిస్తున్నారు. దీంతో పసందైన రాజకీయ విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విందుల్లో ముక్క లేనిదే ముద్ద దిగని పరిస్థితి కాబట్టి చికెన్ కు మంచి డిమాండ్ పెరిగింది. ఈ తరుణంలో ధరలు తగ్గుముఖం పట్టడం రాజకీయ నాయకు లకు కొంతమేర ఖర్చు కలిసొచ్చినట్లైంది.