#Trending

Gold prices hit record highs: రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు: 2024లో ఇదే హయ్యెస్ట్..


రోజురోజుకి బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మార్చి 21న గరిష్టంగా 109 రూపాయలు పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు (మార్చి 29) ఏకంగా 142 రూపాయలు పెరిగింది. 2024లో ఇదే హయ్యెస్ట్ పెరుగుదల అని తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడల, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.63150 (22 క్యారెట్స్), రూ.68880 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ. 1300, రూ. 1420 పెరిగింది.

చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 1300 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1420 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 63150 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 68880 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 63150 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 68880 రూపాయలకు చేరింది. నిన్న రూ. 350 నుంచి రూ. 380 వరకు పెరిగిన బంగారం ధరలు ఈ రోజు ఏకంగా రూ. 1300, రూ. 1420 వరకు పెరిగాయి.

వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (మార్చి 29) వెండి ధర రూ. 300 పెరిగి రూ. 77800 (కేజీ) వద్ద నిలిచింది. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *