#Trending

Gang War In Udupi Video Goes Viral In Social Media:అర్థరాత్రి రోడ్లపై అరాచకం.. 

చట్టాలు ఎంత బలంగా ఉన్నా, పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా కొందరు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. చట్టాలను బేకాతరు చేస్తూ రెచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్‌ శివారులో కొందరు యువకులు ఆర్టీసీ బస్సుపై చేసిన దాడి అందరికీ తెలిసిందే. సైడ్‌ ఇవ్వలేదని ఆరోపిస్తూ ఏకంగా యాభై మంది యువకులు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన సంచనలంగా…

ఈ ఘటన సంచనలంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ సంఘటన సినిమాను తలదన్నేలా ఉంది.

అర్థరాత్రి సమయంలో కొందరు యువకులు రోడ్లపై చేసిన రచ్చ అందరినీ షాక్‌కి గురి చేసింది. రెండు కార్లను పరస్పరం ఢీకొడుతూ, కర్రలతో దాడి చేసుకుంటూ, కారుతో ఢీకొడుతూ నానా హంగామా చేశారు. మే 18వ తేదీన జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఉడిపి – మణిపాల్‌ హైవేపై చోటు చేసుకుంది. రెండు కార్లలో వచ్చిన యువకులు వీరంగం సృష్టించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *