Fight for 40 rupees. Shop owner died in a fight with a customer 40 రూపాయల కోసం గొడవ.. కస్టమర్ తో జరిగిన గొడవలో షాపు ఓనర్ మృతి

కేవలం 40 రూపాయల కోసం జరిగిన గొడవలో ఓ షాపు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఒకటి వెలుగుచూసింది. ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఓ కిరాణా దుకాణం యజమాని వస్తువు కొనుగోలు విషయమై అదనంగా రూ.40 చెల్లించాలని కస్టమర్ ను కోరడంతో జరిగిన గొడవలో మృతి చెందాడు. ఈ ఘటన భద్రక్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరల్పోఖారీ గ్రామంలో చోటుచేసుకుంది.
కేవలం 40 రూపాయల కోసం జరిగిన గొడవలో ఓ షాపు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఒకటి వెలుగుచూసింది. ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఓ కిరాణా దుకాణం యజమాని వస్తువు కొనుగోలు విషయమై అదనంగా రూ.40 చెల్లించాలని కస్టమర్ ను కోరడంతో జరిగిన గొడవలో మృతి చెందాడు. ఈ ఘటన భద్రక్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరల్పోఖారీ గ్రామంలో చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కస్టమర్ బిజయ్ పాండా దుకాణం నుండి రూ .180 విలువైన కొన్ని వస్తువులను కొనుగోలు చేసి రూ .140 చెల్లించాడు. మిగిలిన రూ.40 తర్వాత చెల్లిస్తానని చెప్పాడు. వెంటనే చెల్లించాలని ఓనర్ డిమాండ్ చేయడంతో పాండా డబ్బులు ఇవ్వలేదు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో పాండా కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గుర్తించిన కస్టమర్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
గ్రామస్తులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు కస్టమర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు భద్రక్ టౌన్ డీఎస్పీ అన్షుమన్ ద్వివేది తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నాం. నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని ద్వివేది తెలిపారు.