#Cinema #Trending

Chiranjeevi:  Kranthi Kumar Insulted Him During Nyayam Kavali Movie..నాలుగు వందలమంది ముందు నన్ను అవమానించారు.. ఎంతో బాధపడ్డా ..

నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన చిరంజీవి మెట్టు మెట్టుగా ఎదుగుతూ.. మెగాస్టర్ రేంజ్ కు ఎదిగారు. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిరంజీవి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి స్టార్ హీరోగా మారారు. ఎన్నో ఇబ్బందులు, అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎదుర్కున్న అవమానాల గురించి ప్రస్తావించారు.

మెగా స్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన చిరంజీవి మెట్టు మెట్టుగా ఎదుగుతూ.. మెగాస్టర్ రేంజ్ కు ఎదిగారు. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిరంజీవి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి స్టార్ హీరోగా మారారు. ఎన్నో ఇబ్బందులు, అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎదుర్కున్న అవమానాల గురించి ప్రస్తావించారు. ఆ అవమానాలే తనలో కసి పెంచాయి అని అన్నారు చిరంజీవి. ఆ అవమానాల వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అని తెలిపారు చిరంజీవి. తాజాగా తెలుగు డిజిటల్ క్రియేటర్స్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.

ఇదే కార్యక్రమంలో విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల గురించి మాట్లాడారు. చిరంజీవి తన జీవితంలో ఎన్నో వడిదుడుకులు ఎదుర్కొన్నా అని తెలిపారు ఆ అవమానాలే తనలో కసిని పెంచాయని అన్నారు. న్యాయం కావలి అనే సినిమాలో నటించాను.. శారద చాలా గ్యాప్ తర్వాత ఆ సినిమా చేశారు. ఈ సినిమాలో కోర్ట్ సీన్ షూటింగ్ జరుగుతున్నప్పుడు నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్లి బోనులో నిలుచోండి అని చెప్పాడు.

కోర్టు సీన్ షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ సుమారు 3,4 వందల మంది అక్కడ ఉన్నారు. నేను బోనులో నిలుచున్నాను.. ఇంతలోనిర్మాత క్రాంతి కుమార్  “ఏంటండి మిమ్మల్ని కూడా ప్రత్యేకంగా పిలవాలా..? వచ్చి ఇక్కడ పడి ఉండలేరా..?  మీరేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నారా.? అని అరిచేశాడు. దాంతో నాకు చాలా చిన్నతనంగా అనిపించింది. అలా అతను అందరి ముందు నన్ను అరిచేసిరికి నా గుండె పిండేసినట్టయింది. ఆ రోజు మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. ఆతర్వాత సాయంత్రం సాయంలో క్రాంతి కుమార్ ఫోన్ చేసి వివరణ ఇచ్చారు. శారదా మీద ఉన్న చిరాకుతో నా పైన అరిచానని చెప్పారు. అయితే అది పద్ధతి కాదు అని అంతమంది ముందు రావడకుండా ఉండాలిసింది అని క్రాంతి కుమార్ తో చిరంజీవి అన్నారట. ఆ అవమానమే నాలో కసిని పెంచింది. నువ్వేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నావా అన్న మాట నాకు బాగా గుర్తుండిపోయింది. నేను స్టార్ అయ్యి చూపిస్తా అని అనుకున్నాను. ఆ అవమానాన్ని నా ఎదుగుదలకు మెట్లుగా వాడుకున్నాను. ఆతర్వాత అలాంటివి నా జీవితంలో చాలా జరిగాయి. అవన్నీ ఎదుర్కొన్నాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అని చిరంజీవి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *