BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్‌పై కేసు నమోదు..

కోవై లోక్‌సభ నియోకవర్గంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 10 గంటల తరువాత ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ అన్నామలై(State Chief Annamalai)పై పోలీసులు కేసు నమోదు చేశారు

చెన్నై: కోవై లోక్‌సభ నియోకవర్గంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 10 గంటల తరువాత ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ అన్నామలై పై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి పీలమేడు తదితర ప్రాంతాల్లో అన్నామలై ప్రచారంలో పాల్గొన్నారు. చివరగా ఆయన ఆవారంపాళయంలో ప్రచారానికి వెళ్లేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఆ మేరకు ఆయన ప్రచార వాహనంలో రాత్రి 10 గంటలు దాటిన తర్వాత అక్కడకి వెళ్లడంతో డీఎంకే నిర్వాహకులు అభ్యంతర వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, నిబంధనలు ఉల్లఘించి ప్రచారంలో పాల్గొన్న అన్నామలైపై పోలీసులు కేసు నమోదు చేశారు.
