#Trending

Bus Fire accident in wedding kills five people/ ఘోర ప్రమాదం..పెళ్లి బస్సులో మంటలు అయిదుగురి మృతి

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఘాజీపూర్‌ జిల్లాలో ఓ బస్సుపై హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ‍ప్రమాదంలో  అయిదుగురు మృత్యువాత పడగా.. 11 మందికి గాయాలయ్యాయి. 

వివరాలు.. మౌ జిల్లా నుంచి పెళ్లి బృందం బస్సు ఘాజీపూర్‌లోని మహావీర్‌ ఆలయానికి వెళ్తోంది. బస్సు ముర్దా పట్టణంలో ఓవర్‌హెడ్‌ హైవోల్టేజీ వైర్లను తాకడంతో మంటలు చెలరేగాయి.  గమనించిన స్థానికులు పరుగెత్తుకొచ్చి బస్సుల్లో నుంచి ప్రయాణికులను రక్షించేందుకు సాయం చేశారు. మంటల్లో చిక్కుకొని నిమిషాల వ్యవధిలోనూ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో మెుత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

ఘాజీపూర్‌ విషాద ఘటనపై ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ స్పందించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిజేశారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, గాయపడిన వారందరికీ ఉచిత వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *