#Trending

Bus conductor who Beaten the female passenger..మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్..

బెంగళూరుకు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలిని బస్సు కండక్టర్ చితకబాదిన ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జయనగర్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న సిద్ధపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బిలేపల్లి నుంచి శివాజీనగర్ వెళ్తున్న ఓ మహిళకు, బీఎంటీసీ బస్సు కండక్టర్ కు మధ్య వాగ్వాదం జరిగింది.

బెంగళూరుకు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలిని బస్సు కండక్టర్ చితకబాదిన ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జయనగర్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న సిద్ధపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బిలేపల్లి నుంచి శివాజీనగర్ వెళ్తున్న ఓ మహిళకు, బీఎంటీసీ బస్సు కండక్టర్ కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై స్పందించిన బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్సు కండక్టర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు పత్రికా ప్రకటనలో తెలిపారు. అయితే కండక్టర్ కు, మహిళకు మధ్య జరిగిన ఘర్షణను తోటి ప్రయాణికులు వీడియో తీశారు. వీడియోలో ఆమె అతన్ని చెంపదెబ్బ కొట్టడం కనిపిస్తుంది. ఆ తర్వాత కండక్టర్ మహిళను పదేపదే చెంపదెబ్బలు కొడుతూ రెచ్చిపోయాడు

అయితే బస్సు టికెట్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. అనంతరం ఈ విషయంపై మహిళా ప్రయాణికురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియా ఆధారంగా కండక్టర్ హొన్నప్ప నాగప్ప అగసర్ పై తక్షణమే ‘సస్పెండ్’ చేస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. మహిళా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమివ్వడం, ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు, పానిక్ బటన్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రధాన బస్ స్టేషన్లలో సమాచార బోర్డులు, మహిళల విశ్రాంతి గదుల ఏర్పాటు లాంటి సౌకర్యాలపై సంబంధిత అధికారులు ద్రుష్టి సారిస్తున్నారు.

అయితే మహిళా ప్రయాణీకుల భద్రత కోసం మొత్తం 27,000 మంది డ్రైవింగ్ సిబ్బందికి జెండర్ సెన్సిటైజేషన్ శిక్షణ ఇవ్వబడుతుంది. ప్రయాణీకులతో అమర్యాదగా వ్యవహరిస్తే వ్యక్తులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. అయితే ఆ మహిళ మొదట కండక్టర్ ను కొట్టడం వల్లనే అతను కూడా కొట్టాల్సి వచ్చిందని నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు.

Bus conductor who Beaten the female passenger..మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్..

An innovative solution has been found to

Leave a comment

Your email address will not be published. Required fields are marked *