#Telangan Politics #Telangana #Trending

BJP MLA Rajasingh House Arrest బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ హౌస్‌ అరెస్ట్‌

 హైద‌రాబాద్: గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవ‌ల అల్ల‌ర్లు చోటు చేసుకున్న చెంగిచెర్ల‌కు గురువారం సాయంత్రం వెళ్తాన‌ని రాజాసింగ్ ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న ఇంటి వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు. రాజాసింగ్‌ను ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా పోలీసులు నిర్బంధించారు.

అనంతరం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాజాసింగ్‌ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో హిందువుల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని, ఇది మంచిది కాద‌ని తెలిపారు. బాధితుల‌పై ఎలా కేసులు పెడతారని ప్రశ్నించారు. హిందువులపై దాడి చేస్తే ఊరుకోమని అన్నారు.

కాగా మేడ్చల్‌ జిల్లా చెంగిచెర్లలో హోలీ పండగ సందర్భంగా హోలీ అడుకుంటున్న మహిళలపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని తెలిపారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు దాడి చేశారు.  ఈ దాడిలో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *