Bigg Boss 7: హౌస్‌లో గలీజ్ పురాణం.. బయటపడ్డ శివాజీ క్యారెక్టర్!

ఏ ఒక్కరూ ఇష్టపడని వైనం
సోమవారం జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్‌లో శివాజీని అత్యధికంగా ఐదుగురురు నామినేట్ చేశారు. ముందుగా అమర్ దీప్..శివాజీని నామినేట్ చేస్తూ ఇచ్చి పడేశాడు. ‘ప్రశాంత్ వేటాడటానికి వచ్చాడు.. వాడికి ఫోకస్ ఉంది.. వాడు మగాడంటే.. మరి నేను ఆటాడటానికి కాకుండా పేకడటానికి వచ్చానా అన్నా’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రియాంక జైన్ కూడా శివాజీని నామినేట్ చేస్తూ.. ‘ఎదుటి వాళ్లని మాట్లాడనీయకుండా దబాయిస్తున్నారు’ అని చెప్పింది. దీంతో దీంతో శివాజీ.. ‘నేను ఇక్కడ బిగ్ బాస్ మాట తప్ప ఎవడి మాట వినను’అంటూ వేలు చూపిస్తూ..వెళ్లు వెళ్లు అన్నాడు. దీంతో కోపోద్రిక్తురాలైన ప్రియాంక.. ‘సార్ ఈ ప్రవర్తన సరికాదు.. వేలు చూపించొద్దు’ అని సీరియస్ అయింది. అయినప్పటికీ శివాజీ వేలు దించకుండా.. ‘నీకంత లేదమ్మా’ అని అన్నాడు. ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో కూడా మనోడికి తెలియదు కానీ.. జనానికి మాత్రం నీతులు చెబుతాడు.
బయటపడ్డ శివాజీ అసలు క్యారెక్టర్
బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చి పట్టుమని పది రోజులు కూడా కాలేదు.. అప్పుడు శివాజీ అసలు క్యారెక్టర్ బయటపడింది. ఇతరులకు నీతులు చెబుతాడు కానీ మనోడు పాటించడు. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. పైగా సింపథీ కోసం అన్నట్లుగా పల్లవి ప్రశాంత్‌తో స్నేహం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. రైతుబిడ్డని పొగిడితే తనకు కూడా ఓట్లు పడతాయని భ్రమ పడుతున్నాడు. కానీ ఎన్నాళ్లని ముసుగు వేసుకొని ఉండగలడు? ఎంత నటించాలని ప్రయత్నించిన..అక్కడక్కడ ఒరిజినాలిటీ బయటపడుతూనే ఉంటుంది కదా?. అది ప్రేక్షకులకు ఎప్పుడో తెలిసిపోయింది. హౌస్‌మేట్స్ కూడా ఇది పసిగట్టి.. నిన్నటి నామినేషన్స్‌లో గట్టిగానే ఇచ్చి పడేశారు.
14 మందితో ఇముడలేనివాడు సమాజం గురించి..
బిగ్‌బాస్ హౌస్‌లో 14 మంది ఉన్నారు. వాళ్లలో ఏ ఒక్కరికి కూడా పూర్తిగా నచ్చని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శివాజీయే. తన మాయమాటలు.. సూక్తులతో హౌస్‌మేట్స్ అందరిని తన చేతిల్లో ఉంచుకున్నానని శివాజీ భ్రమ పడ్డాడు. కానీ నిన్నటి నామినేషన్స్ ఆ భ్రమ తొలిగిపోయింది. ఒక్కక్కరు అతని గురించి చెబుతుంటే.. ఇది కదా శివాజీ అసలు రూపం అని అందరికి అనిపించింది. కేవలం 14 మందితో కూడా ఇముడలేని వ్యక్తి.. సమాజం గురించి, వ్యవస్థల గురించి మాట్లాడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉంటుంది.