#Trending

Baby died after slipping out of her father’s arms in a shopping mall! గుండెలు పిండేసే ఘటన.. షాపింగ్‌ మాల్‌లో తండ్రి చేతుల్లో నుంచి జారిపడి పసికందు మృతి!

కుటుంబంతో సరదాగా షాపింగ్‌ మాల్‌కి వచ్చిన ఆ తల్లిదండ్రులకు తీరని విషాదం మిలిగింది. భార్య షాపింగ్‌ చేస్తుంటే ఇద్దరు చిన్నారులను తీసుకుని మూడో అంతస్తులో వేచి చూస్తున్నాడు ఓ వ్యక్తి. ఇంతలో అనుకోని విధంగా అతని చేతుల్లో నుంచి ఏడాది వయసున చిన్నారి జారి కిందపడిపోయాడు. అంత ఎత్తు నుంచి కిందపడటంతో చిన్నారి అక్కడికక్కడే మరణించాడు. ఇందుకు సంబంధించిన హృదయ విదారక..

రాయ్‌పూర్‌, మార్చి 21: కుటుంబంతో సరదాగా షాపింగ్‌ మాల్‌కి వచ్చిన ఆ తల్లిదండ్రులకు తీరని విషాదం మిలిగింది. భార్య షాపింగ్‌ చేస్తుంటే ఇద్దరు చిన్నారులను తీసుకుని మూడో అంతస్తులో వేచి చూస్తున్నాడు ఓ వ్యక్తి. ఇంతలో అనుకోని విధంగా అతని చేతుల్లో నుంచి ఏడాది వయసున చిన్నారి జారి కిందపడిపోయాడు. అంత ఎత్తు నుంచి కిందపడటంతో చిన్నారి అక్కడికక్కడే మరణించాడు. ఇందుకు సంబంధించిన హృదయ విదారక వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షాకింగ్‌ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో మంగళవారం (మార్చి 19) రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని సిటీ సెంటర్ మాల్‌కు భార్యాభర్తలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి షాపింగ్‌కు వెళ్లారు. భార్య షాపింగ్‌ చేస్తుండగా.. ఐదేళ్ల వయసున్న కుమారుడితోపాటు ఏడాది వయసున్న కుమారుడిని తీసుకుని తండ్రి మూడో అంతస్తులో ఉన్న ఎస్కలేటర్‌ వద్దకు వచ్చారు. ఒక చేత్తో ఏడాది పసి బిడ్డను ఎత్తుకుని, మరో చేతో ఐదేళ్ల కుమారుడిని పట్టుకున్నాడు. ఇంతలో పెద్ద కుమారుడు ఎక్కలేరట్‌ పైటి ఎక్కేందుకు యత్నించగా తండ్రి వారించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో మరో చేతిలో ఉన్న ఏడాది బిడ్డ మూడో అంతస్తు నుంచి జారిపోయాడు.

Baby died after slipping out of her father’s arms in a shopping mall! గుండెలు పిండేసే ఘటన.. షాపింగ్‌ మాల్‌లో తండ్రి చేతుల్లో నుంచి జారిపడి పసికందు మృతి!

Vines Shop loot : Public Loot Vines

Leave a comment

Your email address will not be published. Required fields are marked *