#Trending

Babu Arrested.. Junior NTR Taking Light.. RGV’s Tweet Goes Viral – బాబు అరెస్ట్‌.. లైట్‌ తీసుకుంటున్న జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌

పాపం పండింది.. పాపాల చిట్టా బయటపడింది. చేసిన పనికి ఫలితం అనుభవించాల్సిందే! అది మంచైనా, చెడైనా! చంద్రబాబు అమానుష పాలనలో అవినీతి కథలు కోకొల్లలు. అయితే దేన్నైనా మసిపూసి మారేడు కాయ చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఆ అవినీతి కథలను బయటకు రానివ్వలేదు. కానీ చేసిన పాపం ఊరికే పోతుందా? నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ఆ పాపం పండిన నాడు చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తీరాల్సిందే!

టీడీపీకి దూరంగా తారక్‌
ఇప్పుడదే జరిగింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయ్యారు. ఆయన అరెస్టయి రోజులు గడుస్తున్నా జాతీయ స్థాయిలో కనీస మద్దతు లభించలేదు. అంతదాకా ఎందుకు? జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ సైతం బాబు అరెస్ట్‌పై పెదవి విప్పట్లేదు. ఇప్పుడనే కాదు.. చాలా సందర్భాల్లో ఎన్టీఆర్‌.. టీడీపీకి దూరంగానే ఉంటూ వస్తున్నాడు. స్వర్గీయ ఎన్టీఆర్‌ కోసం చెల్లని నాణెం విడుదల చేసినప్పుడు, ప్రత్యేక ప్రచారాలు, సభలు నిర్వహించినప్పుడు సైతం తారక్‌ తనకు పట్టనట్లే ఉండిపోయాడు.

ఇక దబిడి దిబిడే
తాజాగా ఈ అరెస్ట్‌ పైనా స్పందించకపోవడంతో తారక్‌.. బాబును లైట్‌ తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ చేసిన ట్వీట్‌ ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘చంద్రబాబు అరెస్ట్‌ను ఎన్టీఆర్‌ పట్టించుకోవడం లేదు, కనీసం ఖండించడం లేదు కూడా! ఇక టీడీపీ భవిష్యత్తు దిబిడి దిబిడే’ అని ట్విటర్‌లో రాసుకొచ్చాడు.

హరికృష్ణను వాడుకొని వదిలేసిన చంద్రబాబు!
ఆగస్టు వెన్నుపోటు ఎపిసోడ్‌లో భాగంగా నాడు అన్న ఎన్టీఆర్‌ కుర్చీ లాక్కున్న చంద్రబాబు.. కుటుంబ సభ్యులను విచ్చలవిడిగా వాడేశాడు. బావ నందమూరి హరికృష్ణ, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావులకు మంత్రి పదవులిస్తానంటూ ఆశ పెట్టాడు. ఇక్కడ హరికృష్ణతో మరో గేమ్‌ ఆడుకున్నాడు. ఆగస్టు ఎపిసోడ్‌ నాటికి.. హరికృష్ణ ఏ చట్టసభలోనూ సభ్యుడు కాదు. అయినా ఆ విషయం పట్టించుకోకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు.

ఓ వైపు తన పదవికి ఇబ్బంది ఉందని, తనను ఎమ్మెల్సీగా చేయాలని హరికృష్ణ అడిగినా చంద్రబాబు పట్టించుకోలేదు. దీంతో ఆరు నెలల గడువు ముగియగానే హరికృష్ణ అర్ధాంతరంగా మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు గానీ చంద్రబాబు కొట్టిన దెబ్బ హరికృష్ణకు అర్థం కాలేదు. ఎంతైనా వాడుకుని వదిలేయడంలో చంద్రబాబును మించిన వారు మరొకరు ఉండరని హరికృష్ణ తరచుగా చెప్పేవారని ఆయన సన్నిహితులు అంటారు.

ఇక హరికృష్ణ యాక్సిడెంట్‌లో చనిపోయేంత వరకు ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు. ఏపీ ముఖ్యమంత్రిగా 2014లో ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. హరికృష్ణను దరిదాపుల్లోకి రానివ్వలేదు. యాక్సిడెంట్‌లో చనిపోయిన తర్వాత మాత్రం హరికృష్ణ కుటుంబాన్ని మరో రకంగా వాడుకున్నాడు చంద్రబాబు. ఓవైపు హరికృష్ణ భౌతికకాయాన్ని చూసేందుకు వందల మంది వస్తుంటే.. ఆ సందడిలో.. అక్కడే తమతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నించాడని స్వయంగా మంత్రి కేటీఆర్‌ చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

హరికృష్ణ కూతురు సుహాసినిని కూకట్‌పల్లి నుంచి నిలబెట్టి నవ్వులపాలు చేశాడు. సానుభూతితో సుహాసిని గెలిస్తే.. ఆ క్రెడిట్‌ కొట్టేద్దామని ప్లాన్‌ చేసి మొత్తం కుటుంబాన్ని రోడ్డునపడేలా చేశాడు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని సుహాసిని కూకట్‌పల్లిలో ఓడిపోగా.. ఎలాంటి పదవి ఇవ్వకుండా పక్కనబెట్టాడు. ఏపీలో అధికారంలో ఉన్నా.. దాని వల్ల ఎలాంటి ప్రతిఫలం ఎన్టీఆర్‌ కుటుంబానికి గానీ, హరికృష్ణ కుటుంబానికి గానీ అందకుండా చేసిన ఘనత చంద్రబాబుదే.

https://x.com/RGVzoomin/status/1701794661348897056?s=20

Babu Arrested.. Junior NTR Taking Light.. RGV’s Tweet Goes Viral – బాబు అరెస్ట్‌.. లైట్‌ తీసుకుంటున్న జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌

Singareni workers Rs. 1726 crores.. 2 to

Leave a comment

Your email address will not be published. Required fields are marked *