Actress Iswarya: Illegal affair with someone else..వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని తనను వేధిస్తోందంటూ సీరియల్ నటి భర్త ఆవేదన

ప్రముఖ టీవీ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని మీడియాను ఆమె భర్త ఆశ్రయించాడు. పెళ్లయిన తర్వాత పాతిక లక్షలు కాజేసి విడాకులు కోరుతూ తనను తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
విశాఖ: ప్రముఖ టీవీ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య (Addala Iswarya) తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని మీడియాను ఆమె భర్త ఆశ్రయించాడు. పెళ్లయిన తర్వాత పాతిక లక్షలు కాజేసి విడాకులు కోరుతూ తనను తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకొని కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతోందని, తనకు న్యాయం చేయాలని బాధిత భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ కోరుతున్నాడు. 2023 సెప్టెంబర్ 6న శ్యామ్ కుమార్, ఐశ్వర్యలు పెళ్లి చేసుకున్నారు
కాపు మ్యాట్రిమోనీ (Matrimony) ద్వారా సీరియల్ నటిని శ్యాంకుమార్ పెళ్లి చేసుకున్నాడు. జీ తెలుగు, మా టీవీ, ఈటీవీ, జెమినీ టీవీ పలు ఛానల్లో ప్రసారమయ్యే టీవీ సీరియల్స్‌లో ఐశ్వర్య నటిస్తోంది. సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించింది. అమ్మాయి గారు, పలుకే బంగారామాయేనా, అల వైకుంఠపురం, అత్తారింటికి దారేది సీరియల్స్‌లో ఐశ్వర్య నటిస్తోంది.పెళ్లి అయిన నెల రోజుల తర్వాత అక్రమ సంబంధం బయటపడిందని.. హైదరాబాద్‌కు చెందిన రియల్టర్ కరణం రమేష్ బాబుతో వివాహేత సంబంధం పెట్టుకుని తనను బెదిరింపులకు గురి చేస్తోందని శ్యాంకుమర్ ఆరోపించాడు.