Actor Vijay Sethupathi Attended His Fans Marriage : అభిమానుల పెళ్లి.. స్వయంగా కలిసి ఆశీర్వదించిన స్టార్ హీరో..

అగ్ర కథానాయికుడు అయినా నిజ జీవితంలో మాత్రం చాలా సింపుల్. స్టార్ డమ్తో ఎలాంటి సంబంధం లేకుండా సింపుల్ లైఫ్ గడిపేస్తుంటాడు. వివాదాలకు, విమర్శలకు దూరంగా ఉంటూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా తన అభిమాని పెళ్లిలో సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. పైన ఫోటోలో పంచెకట్టులో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషలలో అనేక సినిమాల్లో నటించి స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. హీరోగానే కాకుండా విలన్ పాత్రలలోనూ అద్భుతమైన నటనతో మెప్పించాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. హీరోయిజం కాదు..కంటెంట్ నచ్చితే ఎలాంటి పాత్రలు అయినా చేసేందుకు రెడీగా ఉంటాడు. అందుకే భాషతో సంబంధం లేకుండా ఆ హీరోకు ప్రాణాలిచ్చే అభిమానులు ఉన్నారు. ఇక్కడే కాదు విదేశాల్లోనూ ఆ హీరోకు ఫ్యాన్ బేస్ ఉంది. అగ్ర కథానాయికుడు అయినా నిజ జీవితంలో మాత్రం చాలా సింపుల్. స్టార్ డమ్తో ఎలాంటి సంబంధం లేకుండా సింపుల్ లైఫ్ గడిపేస్తుంటాడు. వివాదాలకు, విమర్శలకు దూరంగా ఉంటూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా తన అభిమాని పెళ్లిలో సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. పైన ఫోటోలో పంచెకట్టులో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తుపట్టారా.. ? అతడు మరెవరో కాదండి.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి శుక్రవారం తన అభిమాని పెళ్లికి హాజరయ్యాడు. ఆయన రాకతో అక్కడున్న అతిథులు ఆశ్చర్యపోయారు. మధురై జిల్లా ఉసిలంపాటి మున్సిపాలిటీ పరిధిలోని కీజాప్టూరుకు చెందిన జయబాస్, జయపాల్ అనే ఇద్దరు వ్యక్తులు విజయ్ సేతుపతికి వీరాభిమానలు. అలాగే విజయ్ సేతుపతి ఫ్యాన్ అండ్ ఛారిటబుల్ సోసైటీకి ఒకరు అధ్యక్షుడిగా ఉంటే..మరొకరు జిల్లా ఉప కార్యదర్శిగా ఉన్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ముల వివాహం జూన్ 2న ఉసిలంబట్టిలో జరగనుంది. అయితే అదే రోజు విజయ్ సేతుపతికి సినిమా షూటింగ్ షెడ్యూల్ ఉండడంతో ఈరోజే నూతన వధూవరులను కలుసుకున్నారు.
ఈరోజు వధూవరులను స్వయంగా కలసుకుని శుభాకాంక్షలు తెలిపి వారిని ఆశీర్వదించారు. అనంతరం అక్కడున్న వారితోల ఫోటోలు దిగారు. అయితే విజయ్ సేతుపతి అక్కడే ఉన్న తన అభిమానుల బంధువుల పిల్లాడిని ఎత్తుకుని ఫోటో దిగడం విశేషం. అనంతరం మెట్టుపాళయంలో షూటింగ్ కు బయలుదేరారు. డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు విజయ్ సేతుపతి.