#Andhra Politics #Elections #Trending

పవన్‌ కల్యాణ్ పోటీ చేయకపోతే టికెట్‌ వాళ్ళకే.. జనసేన నేతల హామీ!

ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. పాత పీఆర్పీ, టీడీపీ నేతలతో మంతనాలు జరుపుతూ ఎప్పటికప్పుడు పార్టీ బలమెంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బలిజలకే టికెట్ ఇవ్వాలని అది కూడా లోకల్స్ కే ఇవ్వాలని పట్టు పడుతున్న ఆ సామాజిక వర్గం పవన్‌ పోటీ చేస్తే మాత్రం ఒకే అంటుండడం ఆసక్తికరంగా మారింది.

ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. పాత పీఆర్పీ, టీడీపీ నేతలతో మంతనాలు జరుపుతూ ఎప్పటికప్పుడు పార్టీ బలమెంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బలిజలకే టికెట్ ఇవ్వాలని అది కూడా లోకల్స్ కే ఇవ్వాలని పట్టు పడుతున్న ఆ సామాజిక వర్గం పవన్‌ పోటీ చేస్తే మాత్రం ఒకే అంటుండడం ఆసక్తికరంగా మారింది.

ఆధ్యాత్మిక నగరం తిరుపతి అసెంబ్లీ టికెట్‌ జనసేనకే కేటాయిస్తారనే చర్చ రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. అయితే ఇక్కడ నుంచి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసే అవకాశముందని, ఇప్పటికే ఆయన దీనిపై ఫోకస్‌ చేశారని ప్రచారం జరుగుతోంది. 2009 ఎన్నికల్లో అన్న చిరంజీవి పరపతిని పెంచిన తిరుపతి ఇప్పుడు తమ్ముడిని అక్కున చేర్చుకుంటుందని జనసేన భావిస్తోంది. ఇందులో భాగంగానే జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని తెలుస్తోంది. బలిజ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండటం పవన్ కళ్యాణ్ కు కలిసి వచ్చే అంశంగా మారిపోయింది.

అయితే తిరుపతి టికెట్ స్థానిక బలిజలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న బలిజ సంఘాలు పవన్ అయితే ఓకేనని ముందుగానే చెప్పేశాయి. దీంతో జనసేనాని పోటీకి లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న ప్రచారంపై ఇప్పటిదాకా అధికారిక ప్రకటన లేకపోయినా బలమైన అభ్యర్థి కోసం మాత్రం జనసేన కసరత్తు చేస్తూనే వచ్చింది. అయితే తాజా పరిణామాలు, బలిజ అభ్యర్థి కోసం ప్లాన్ చేస్తున్న జనసేన ప్రయత్నాలు చూస్తే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారన్న సంకేతాలు ఇస్తోంది.

జనసేన పరిశీలనలో ఉన్న బలిజ నేతలను పిలిపించి మాట్లాడిన ఆ పార్టీ హై కమాండ్… టీడీపీకి చెందిన బలమైన బలిజ నేతలతో కూడా సమావేశం అవుతోంది. పవన్ పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తోంది. తిరుపతి టికెట్ రేసులో ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు మరికొందరిని ఆ పార్టీ హైకమాండ్ పిలిపించి తిరుపతి జనసేనకేనని స్పష్టం కూడా చేసినట్లు తెలుస్తోంది. తిరుపతిలో జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలో ఉంటారని మిగతా టీడీపీ ఆశావహులకు కూడా ఆ పార్టీ హైకమాండ్‌ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.

ఎన్టీఆర్, చిరంజీవి లాంటి సినీరంగ ప్రముఖులను అసెంబ్లీకి పంపిన తిరుపతి ఇప్పుడు పవన్ ను పంపనుందనే ప్రచారం జోరందుకుంది. పొత్తులపై దాదాపు స్పష్టత రావడంతో వైసీపీ అభ్యర్థికి ప్రత్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉంటారని తెలుస్తోంది. ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి నుంచి పవన్‌ను పోటీ చేయించాలని టీడీపీ హై కమాండ్ కూడా కోరుకుందనే ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పోటీపై జనసేన క్లారిటీ ఇవ్వకపోయినా టెంపుల్ సిటీలో జనసేననే పోటీలో ఉండాలన్న దానిపై మాత్రం ఆ పార్టీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

2009లో ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి గెలవడం, మరోవైపు బలిజ సామాజిక వర్గం అధికంగా ఉన్న తిరుపతిలో పవన్ కళ్యాణ్ కు సంపూర్ణ మద్దతు ఉంటుందన్న అభిప్రాయం జనసేనలో నాటుకు పోయింది. తిరుపతిలో బలిజ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలోనూ తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గెలిపించుకుంటామని చర్చనే నడిచింది. పాత పీఆర్పీ నేతలు, టీడీపీ ఆశావహులు కలిసి పని చేసేలా పవన్ యత్నిస్తున్నారు.

పవన్‌ కనుక పోటీ చేయకపోతే టికెట్‌ బలిజలకే అని జనసేన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బలం, బలగంపై లెక్కలేసుకున్నాక తిరుపతి పవన్‌కు పట్టం కడుతుందన్న నమ్మకంతో జనసేన ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *