#Top Stories

Welcome to Tihar Jail.. Sukesh’s sensational letter as Kejriwal’s target..తీహార్ జైలుకు స్వాగతం.. కేజ్రీవాల్‌ టార్గెట్‌గా సుకేష్ సంచలన లేఖ..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా.. పలువురు కీలక నేతలు ఈ కేసులో ఉండటం.. అరెస్టవ్వడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.. తాజాగా కేజ్రీవాల్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు సుకేష్‌ చంద్రశేఖర్‌.. అప్రూవర్‌గా మారి నిజాలు బయటపెడతా అంటూ హెచ్చరించాడు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా.. పలువురు కీలక నేతలు ఈ కేసులో ఉండటం.. అరెస్టవ్వడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.. తాజాగా కేజ్రీవాల్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు సుకేష్‌ చంద్రశేఖర్‌.. అప్రూవర్‌గా మారి నిజాలు బయటపెడతా అంటూ హెచ్చరించాడు. ఖచ్చితంగా కేజ్రీవాల్‌ను ఇందులోకి తీసుకొస్తానని..కేజ్రీవాల్‌ టీమ్‌ రహస్యాలు కూడా వెలుగులోకి తెస్తానంటూ సుకేష్‌ చంద్రశేఖర్ లేఖలో తెలిపాడు. అంతకముందు జైలు నుంచే కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై సుఖేష్‌‌ లేఖ రాశారు.. కవిత అరెస్ట్‌కు తీహార్ జైలు స్వాగతం పలుకుతుందంటూ లేఖ రాసిన సుఖేష్..కేజ్రీవాల్‌ను వదిలిపెట్టలేదు. తీహార్ క్లబ్’లోకి స్వాగతం అంటూ సుఖేష్ లేఖ రాశారు.. సత్యం ఎప్పటికీ గెలుస్తుంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని చెప్పడానికి ఇదే ఉదాహరణ అంటూ లేఖలో రాశాడు. మీ డ్రామాలు చివరి దశకు చేరాయి. ఇకక ఎంత నటించినా తప్పించుకోలేరని.. త్వరలోనే మీ మోసాలను పూర్తిగా బహిర్గతం చేస్తనాంటూ హెచ్చరించాడు.దీంతో సుఖేష్‌ లేఖ హాట్‌ టాపిక్‌గా మారింది.

నిజమే గెలుస్తుందన్న సుకేష్‌ చంద్రశేఖర్‌.. సరికొత్త భారత్‌కు ఉన్నశక్తికి ఇదొక క్లాసిక్ ఉదాహరణ అంటూ పేర్కొన్నాడు.

‘‘తీహార్‌ క్లబ్‌కు బాస్‌గా మీకు స్వాగతం పలుకుతున్నా.. ఖట్టర్‌ ఇమాన్దార్‌ అనే డ్రామాలకు ముగింపు పడింది.. కేజ్రీవాల్‌ అవినీతి మొత్తం బహిర్గతమవుతోంది.. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ 10 కుంభకోణాలు చేశారు.. నాలుగు కుంభకోణాల్లో తానే సాక్షిగా ఉన్నా.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ప్రారంభం మాత్రమే.. అప్రూవర్‌గా మారి నిజాలు బయటపెడతా’’.. అంటూ సుకేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *