Voter Details: Find out easily if your name is in the voter list..Voter Details: ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో.. ఈజీగా ఇట్టే తెలుసుకోండి..

ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు, దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించింది. ఏప్రిల్ 19 నుండి జూన్ 1, 2024 వరకు ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ, ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు, దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించింది. ఏప్రిల్ 19 నుండి జూన్ 1, 2024 వరకు ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ, ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టేందుకు వివిధ రాజకీయ పార్టీలు రకరకాల ప్రచారాలు చేస్తున్నట్లు గుర్తించింది సీఈసీ. అదే క్రమంలో కొన్ని కారణాల వల్ల ఓటరు జాబితా నుంచి కొన్ని పేర్లను తొలగిస్తున్నట్లు అనేక ఫిర్యాదులను అందుకుంది. అయితే ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించడానికి అనేక కారణాలు ఉంటాయి.
సరైన ఆధారాలు లేకపోయినా, తప్పుడు వివరాలు నమోదు చేసినా ఓటరు జాబితా నుంచి వ్యక్తులను తొలగిస్తారు. అలాంటి పరిస్థితిలో ఎన్నికల తేదీకి ముందు తమ ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో చిటికెలో కనుక్కోవచ్చు. ఎక్కడున్నా ఓటరు జాబితాను ఖచ్చితంగా చెక్ చేయవచ్చు. ఓటరు జాబితాలో అర్హులైన వారి పేరు ఉందో లేదో ఇట్టే తెలుసుకోవడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ కింది సలహాలు పాటిస్తే చాలు. ఓటరు జాబితాలో పేరును తనిఖీ చేసే ముందు, మీరు ఓటరు ID కార్డ్‌పై EPIC నంబర్ (ఎలక్టర్స్ ఫోటో గుర్తింపు కార్డు) ఉండాలి. అలాగే ఓటరు జాబితాలో మీ పేరును తనిఖీ చేయడానికి పూర్తి పేరు, వయస్సు, పుట్టిన తేదీ, జిల్లాతో పాటు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయాలి.
ఓటరు జాబితాలో పేరు చెక్ చేసుకునే విధానం..
ముందుగా మీరు Googleలో ఓటర్ల సేవా పోర్టల్‌ను సర్చ్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ సర్చ్ లో లోకి వెళ్లి పూర్తి వివరాలు https://electoralsearch.eci.gov.in/ తెలుసుకోవచ్చు. ఈ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో, ఓటరు జాబితాలో మీ పేరును చెక్ చేయడానికి మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. మొదటి ఆప్షన్ ఏమిటంటే, మీరు వివరాలను నమోదు చేయడం ద్వారా ఓటరు జాబితాలో పేరును చెక్ చేయవచ్చు. రెండవ పద్ధతి EPIC ద్వారా సర్చ్ చేసి వివరాలు పొందవచ్చు. ఇక మూడవ పద్ధతి మొబైల్ ద్వారా కూడా ఓటరు జాబితాలో మీ పేరు చేర్చబడిందో లేదో తెలుసుకోవచ్చు.
సెర్చ్ బై డిటెయిల్స్ ఆప్షన్ ద్వారా ఓటరు జాబితాలో పేరును చెక్ చేస్తే, ఈ ఆప్షన్‌లో మీ నుంచి కొన్ని ముఖ్యమైన సమాచారం అడుగుతుంది. ముందుగా రాష్ట్రాన్ని, భాషను ఎంచుకోవాలి. రాష్ట్రం, భాషను ఎంచుకున్న తర్వాత, మీరు పూర్తి పేరు, పుట్టిన తేదీ, వయస్సు, లింగం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం వంటి కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని నమోదు చేయాలి. ఆ తర్వాత ఒక క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.